Deepthi Sunaina : చీరకట్టులో దీప్తి సునయన సోయగం

-

దీప్తి సునయన.. ఈ సోషల్ మీడియా ఇన్​ఫ్లెయన్సర్​​కు మామూలుగా క్రేజ్ ఉండదు. తరచూ డిఫరెంట్ స్టైల్స్​లో ఫొటోషూట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా దీప్తి ట్రెడిషనల్ లుక్​లో కనిపించింది. పట్టుచీరలో చాలా పద్ధతిగా కనిపిస్తోందని నెటిజన్లు అంటున్నారు.

దీప్తి సునయన తాజాగా పట్టుచీరలో తన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ట్రెడిషనల్ లుక్​లో దీప్తి బుట్టబొమ్మలా కనిపిస్తోంది అంటూ కుర్రాళ్లు కామెంట్లు చేస్తున్నారు. ఎప్పుడూ ట్రెండీ ఔట్​ఫిట్స్​లో కనిపించే దీప్తి.. ఈసారి సంప్రదాయంగా కనిపించి ఆకట్టుకుంది.

మరోవైపు దీప్తి ఇండిపెండెంట్ మ్యూజిక్ ఆల్బమ్స్​లో నటిస్తూ తన సత్తా చాటుతోంది. ఇక యూట్యూబ్, ఇన్​స్టాగ్రామ్​లలో డిఫరెంట్ వీడియోలు చేస్తూ వ్యూయర్స్​ను ఆకట్టుకుంటోంది. తాజాగా దీప్తి ఏమోనే అనే సాంగ్​తో అలరించింది. ఈ సాంగ్ విడుదలైన క్షణాల్లోనే లక్షల వ్యూస్​ను సొంతం చేసుకుంది.

ప్రస్తుతం దీప్తి తన ఫోకస్ అంతా యూట్యూబ్ వీడియోలపైనే పెడుతోంది. ఇటీవలే ఈ ముద్దుగుమ్మ హైదరాబాద్​లో ఓ సొంత ఇంటిని కూడా కొనుగోలు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news