దేశంలోని 8 హైకోర్టుల్లో చీఫ్ జస్టిస్‌ల నియామకం.. సుప్రీం నోటిఫికేషన్

-

దేశవ్యాప్తంగా ఉన్న 8 హైకోర్టుల్లో ఉన్నత న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అయ్యింది. సుప్రీంకోర్టు కొలీజియం ఈ నోటిఫికేషన్‌ను ప్రత్యేకంగా జారీ చేసింది. శనివారం విడుదలైన ఈ నోటిఫికేషన్‌లో ఢిల్లీ, జార్ఖండ్ , హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, లడఖ్, మధ్యప్రదేశ్ , కేరళ , మేఘాలయ, మద్రాస్ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల నియామకానికి పేర్లను ఈ కొలీజియం సిఫార్సు చేసింది.

ఈ విషయాన్ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ ద్వారా వెల్లడించారు.భారత రాజ్యాంగం అందించిన అధికారాలను ఉపయోగించి, రాష్ట్రపతి కింది హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను నియమించడం, బదిలీ చేయడం సంతోషంగా ఉందని వెల్లడించారు. అలాగే, కొత్తగా నియామకాలైన వారి పేర్లను కూడా ప్రకటించారు. వారిలో ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్‌గా జస్టిస్ మన్మోహన్‌కు పూర్తిస్థాయి పదోన్నతి ఇచ్చారు.అలాగే ఢిల్లీ హైకోర్టు జడ్జి రాజీవ్ శాఖ్దర్‌కు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా బదిలీ, బాంబే హైకోర్టు జడ్జి నితిన్ మధుకర్‌కు జమ్దార్‌ను కేరళ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా బదిలీ, బాంబే హైకోర్టు జడ్జి కేఆర్ శ్రీరాంకు మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా బదిలీ, కోలకత్తా హైకోర్టు జడ్జి ఇంద్ర ప్రసన్న ముఖర్జీని మేఘాలయ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా బదిలీ,జమ్మూ అండ్ లడఖ్ హైకోర్టు జడ్జి తశీ రబ్‌స్తాన్‌‌కు అదే కోర్టు చీఫ్ జస్టిస్‌గా పదోన్నతి, ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ సురేశ్ కుమార్ కైత్‌కు మధ్యప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా బదిలీ, ఢిల్లీ హై కోర్టు జడ్జి గుర్మీత్ సింగ్‌కు జమ్మూ అండ్ లడాఖ్ జడ్జిగా పదోన్నతి కల్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news