BREAKING : ప్ర‌కాశ్‌రాజ్ ప్యాన‌ల్ స‌భ్యుల రాజీనామా ఆమోదం

-

మా అసోసియేషన్ వ్యవహారంలో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. తాజాగా ప్రకాష్ రాజు ప్యానెల్ సభ్యుల రాజీనామాలను ఆమోదించారు మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు. మా అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల తర్వాత… ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో గెలిచిన ఏకంగా.. 11 మంది అసోషియేష‌న్ స‌భ్యులు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేశారు.

అయితే.. ఆ రాజీనామాల‌ను మొద‌ట్లో తాను ఆమోదించ‌బోన‌ని.. అధ్య‌క్షుడు మంచు విష్ణు పేర్కొన్నారు. అయితే.. తాజాగా ఆ 11 మంది అసోషియేష‌న్ స‌భ్యుల రాజీనామాల‌ను ఆమోదించారు అధ్య‌క్షుడు మంచు విష్ణు. ఈ మేర‌కు మా అసోసియేషన్ కార్యాల‌యం అధికారికంగా ప్ర‌క‌ట‌న చేసింది. రాజీనామాలు చేయ‌వ‌ద్ద‌ని.. మొద‌టి నుంచి తాను చెబుతూనే ఉన్నాన‌ని.. కానీ స‌భ్యులు మాట విన‌లేద‌ని.. ఈ సంద‌ర్భంగా మంచు విష్ణు పేర్కొన్నారు. కాగా.. మా అసోసియేషన్ అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో మంచు విష్ణు ప్యానెల్ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news