అమర్‌రాజా లో ఖాళీలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి!

-

ప్రముఖ అమర్‌రాజా గ్రూప్‌ లో అప్రంటీస్‌ ఖాళీల భర్తీకి ఏపీఎస్‌ఎస్‌డీసీ నుంచి నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఏపీ స్టేట్‌ స్కిల్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ నుంచి మరో జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలని నోటిఫికేషన్లో తెలిపారు. అభ్యర్థులను ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ అందించనుంది. శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత అమర రాజా గ్రూప్‌ లో ఉద్యోగావకాశం కల్పిస్తారు.

అమర్‌రాజా

మొత్తం 150 అప్రంటీస్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి(పాస్‌ లేదా ఫెయిల్‌), ఇంటర్‌(పాస్‌/ఫెయిల్‌), ఐటీఐ(పాస్‌ లేదా ఫెయిల్‌) అయిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

  • 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులకు 50 ఖాళీలు ఉన్నాయి. వయస్సు 16–25 ఏళ్లు ఉండాలి.
    ఎంపికైన వారికి మొదటి మూడు నెలల పాటు రూ. 7500, తర్వాత 9 నెలలు నెలకు రూ. 9, 733, ఆ తర్వాత 12 నెలల వరకు రూ. 9,933 చొప్పున వేతనం చెల్లించనున్నారు.
  • ఇంటర్‌ విద్యార్హత కలిగిన అభ్యర్థులకు 50 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థుల వయస్సు 16–25 ఏళ్లు ఉండాలి. మొదటి మూడు నెలల పాటు నెలకు రూ. 7,500 ఆ తర్వాత 9 నెలలు రూ. 9,933 చొప్పున, చివరి 12 నెలలు రూ.10,133 చొప్పున వేతనం అందించనున్నారు.
  • ఐటీఐ విభాగంలో మొత్తం 50 ఖాళీలున్నాయి. వయస్సు 18–29 ఏళ్లు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ. 9,933 నుంచి రూ. 10,133 వరకు చెల్లించనున్నట్లు ప్రకటించారు.

అభ్యర్థులు ఏపీఎస్‌ఎస్‌డీసీ అధికారిక వెబ్‌ సైట్లో రిజిస్టర్‌ చేసుకోవాలి. హెచ్‌ఆర్‌ రౌండ్‌ వర్చువల్‌ ద్వారా అభ్యర్థుల ఎంపిక జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news