తెలంగాణలో పూర్తిగా లాక్ డౌన్ ఎత్తివేత?

-

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా అన్ని వ్యవస్థలు నష్టాల్లోకి వెళ్లిపోయాయి. నష్టాలను సవరించేందుకు కీలక నిర్ణయాలు తప్పడం లేదని భావిస్తోంది. దీంతో ఢిల్లీ తరహా నిర్ణయానికి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

కాగా జూన్ 19తో తెలంగాణలో లాక్ డౌన్ గడువు ముగుస్తోంది.  ప్రస్తుతం రాష్ట్రంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మినహాయింపులు ఇచ్చారు. జూన్ 19 వరకు లాక్ డౌన్ సడలింపు ఆంక్షలు కొనసాగనున్నాయి. మరోవైపు జూన్ 20 తర్వాత లాక్‎డౌన్ ఎత్తివేయాలని ప్రభుత్వం. యోచిస్తోంది.

తెలంగాణలో కరోనా పాజిటివిటి 1.36 శాతానికి తగ్గింది. దీంతో అన్‎లాక్ చేసే విధంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో ఈ నెల 19 తర్వాత నైట్ కర్ఫ్యూ కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా జులై 1 నుంచి 50 శాతం వరకు ఆక్యుపెన్సీతో థియేటర్లు, బార్లు, జిమ్‎లకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. సీఎం, మంత్రులు భేటీ అయిన తర్వాత అధికారికంగా తెలంగాణలో అన్‌లాక్ ప్రకటిస్తారేమో చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news