ఢిల్లీ ప్రజలకు వాటర్ ఎటిఎం కార్డు లు జారీ … !

-

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన ప్రజల బాగోగులు మరియు అభివృద్ధి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 100 శాతం ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశ్యంతోనే రాజకీయ అరంగేట్రం చేసిన ఈయన ఆ దిశగానే ప్రయాణిస్తున్నారు. తాజాగా ఢిల్లీ ప్రజలకు నీటి సమస్యను తొలగించడానికి ఒక ఉన్నతమైన మార్గాన్ని తీసుకువచ్చారు. ఢిల్లీ లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఒక రోజుకు 20 లీటర్ల నీటిని అందించనున్నారు. ఈ నీటిని పొందాలంటే సదరు ప్రజల దగ్గర వాటర్ ఎటిఎం కార్డు ఉండాల్సిందే… ఈ కార్డు ఉన్న వారు సరాసరి వాటర్ ఎటిఎం దగ్గరకు వెళ్లి దానిని యూజ్ చేసుకుని 20 లీటర్లు నీరు పొందడానికి అర్హత లభిస్తుంది. కాగా ఢిల్లీ ప్రభుత్వం తెలియచేస్తున సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 2 వేల కుటుంబాలకు RO నీటిని అందించడానికి ఈ వాటర్ ఎటిఎం కార్డులను జారీ చేశారట.

ఇక రాష్ట్రంలో ఎక్కువ ప్రజలు ఉన్న ప్రాంతాలల్లో 4 వాటర్ ఎటిఎం లను నెలకొల్పడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.. మొదటిసారి కావడం వలన 500 వాటర్ ఎటిఎం లను ఏర్పాటు చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news