హైదరాబాద్ లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం

-

రెండు రోజుల గ్యాప్ తర్వాత హైదరాబాద్ లో ఇవాళ సాయంత్రం మళ్లీ వర్షం దంచికొడుతోంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతో నగర వాసులు బెంబేలెత్తిపోతున్నారు. జంట నగరాల్లో ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. ముఖ్యంగా కుత్బుల్లాపూర్, తిరుమలగిలి, అల్వాల్, బోయిన్ పల్లి, జవహర్ నగర్, బేగంప్ట్, బొల్లారం, మారేడుపల్లి, చిలకలగూడ, తార్నాక, ఓయూ, లాలాపేట్, హబ్సిగూడ, ఎల్ బీ నగర్, చైతన్యపురి, దిల్ సుఖ్ నగర్ లో భారీ వాన పడుతోంది.

భారీ వర్షంతో హైదరాబాద్- విజయవాడ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. అబ్దుల్లాపూర్ మెట్ నుంచి హైదరాబాద్ వైపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షం ధాటికి ట్రాఫిక్ జామ్ అయి వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. భారీ వర్షంతో డీఆర్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమైంది. సహాయ చర్యలకు టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేసింది. 040-2111 1111, 9000113667 నంబర్లకు కాల్ చేయమని సూచించింది. మరోవైపు భాగ్యనగర ప్రజలెవరూ వర్షం తగ్గే వరకు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి సూచించారు. కార్యాలయాల్లో ఉన్నవారు కూడా వాన తగ్గిన తర్వాతే ఇంటికి బయల్దేరాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news