మూడు రాష్ట్రాల్లో పోటీ చేసి సత్తా చూపిస్తాం: సీఎం అరవింద్ కేజ్రీవాల్

-

ఈ రోజు ఉదయమే కేంద్ర ఎన్నికల సంఘం మొత్తం అయిదు రాష్ట్రాలలో ఒకేసారి ఎన్నికలను జరిపించడానికి షెడ్యూల్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల గురించి ఢిల్లీ సీఎంగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ మీడియా ముందుకు వచ్చి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ మాట్లాడుతూ.. నవంబర్ లో జరగనున్న ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ మూడు రాష్ట్రాలలో పోటీ చేయనుంది అంటూ స్పష్టం చేశారు.. పోటీ చేయనున్న రాష్ట్రాలలో ఛత్తీస్ ఘడ్ , రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి అని కేజ్రీవాల్ ప్రకటించారు. వీలైనంత త్వరగా ఈ రాష్ట్రాలలో ఉన్న అన్ని అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తామని కేజ్రీవాల్ ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పారు.

మీడియా మిత్రులు ఈ రాష్ట్రాలలో ఇండియా కూటమితో కలుపుకు వెళ్తారా లేదా అన్న ప్రశ్నకు .. నేను ఏ నిర్ణయం తీసుకున్నా మీకు చెప్పే తీసుకుంటా అంటూ తప్పుకున్నాడు కేజ్రీవాల్. మరి పొట్టులోనే పోటీ చేస్తారా లేదా ఒంటరిగానే అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news