చైనాలో పుట్టి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహామ్మారిపై సరైన సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించలేదని, డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ పై పలు దేశాలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెడ్రోస్‌పై విరుచుకుపడ్డారు. చైనీస్ వైరస్ విషయంలో ప్రపంచాన్ని హెచ్చరించడంలో డబ్ల్యూ హెచ్ో విఫలమైందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దానికి కేటాయించే ఫండ్స్‌ని ఇక నుంచి ఆపేస్తున్నామంటూ సంచలన ప్రకటన చేశారు కూడా.
అయితే గత కొన్ని నెలలుగా టెడ్రోస్ వైరస్‌పై సంచలన ప్రకటనలు చేస్తూనే వున్నారు. అయితే ఆయన ప్రకటనలు సామాన్య జనాన్ని హెచ్చరించేలా కాకుండా భాయాందోళనకు గురిచేసేలా వుంటున్నాయి. తాజాగా ఆయన మరోసారి అలాంటి ప్రకటనే చేయడం ఆసక్తికరంగా మారింది. కరోనా వైరస్ ఇప్పట్లో మనల్ని విడిచిపోదని ఒకసారి, దీనితో కలిసి రెండేళ్ల పాటు ప్రయాణం చేయాల్సిందేనని మరోసారి తాజాగా ఈ మహమ్మారి చివరిది కాదని భవిష్యత్తులో ఇలాంటివి ఎన్నో వస్తాయని అందుకు ప్రపంచం సిద్ధంగా వుండాలని ప్రకటించడం కలకలం రేపుతోంది.
టెడ్రోస్ తాజా ప్రకటనపై ఆనంద్ మహీంద్రా తనదైన స్టైల్లో చురకలు అంటించారు. నిరాశకు గురి చేయకుండా ముందు మమ్మల్ని ఈ మహమ్మారి సంక్షోభం నుంచి బయటపడనివ్వరా!` అని సెటైర్ వేశారు.ఆయన ట్వీట్‌కి నెటిజన్స్ రికార్డు స్థాయిలో సపోర్ట్‌గా నిలిచారు. డబ్ల్యూ హెచ్ ఓ ఏ విషయాన్ని తిన్నగా చెప్పిందని విమర్శలు గుప్పించారు. నిజమే డబ్ల్యూ హెచ్‌లో డైరెక్టర్ జనరల్ ఈ వైరస్ విషయంలో మొదటి నుంచి ప్రపంచాన్ని హెచ్చిరిస్తున్నట్టుగా లేదని, భయాందోళనకు గురిచేస్తున్నట్టగానే వుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.