గర్భం ధరించకుండానే ఆ లక్షణాలు కనిపిస్తున్నాయా..? కారణాలు అవే

-

పెళ్లైన మహిళలకు పిరియడ్స్‌ స్కిప్‌ అయితే..వెంటనే ప్రగ్నెస్సీ అనే అనుకుంటారు.. వికారం, వాంతులు, బలహీనత, రొమ్ములలో వాపు మొదలైన అన్ని లక్షణాలను ఎదుర్కొంటారు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే గర్భం దాల్చినట్లు అనుకుంటారు..కానీ చాలా సార్లు కొందరు మహిళలకు ప్రెగ్నెన్సీ లక్షణాలు వస్తాయి. వాస్తవానికి ఆమె గర్భవతి కాదు. ఈ పరిస్థితిని ఫాంటమ్ ప్రెగ్నెన్సీ అంటారు. వైద్య భాషలో దీనిని సూడోసైసిస్ అంటారు. గర్భం ధరించకుండానే.. ఆ లక్షణాలు కనిపించడాన్ని ఫాంట్‌ ప్రెగ్నెన్సీ అంటారు.

ఫాంటమ్ ప్రెగ్నెన్సీ అనేది గర్భస్రావానికి సంబంధించినది కాదు. ఇందులో గర్భం దాల్చకుండానే స్త్రీలో గర్భం యొక్క లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి. ఫాంటమ్ గర్భం ఎందుకు వస్తుందో సరైన కారణాలు తెలియవు. కానీ చాలా మంది నిపుణులు దీనిని స్త్రీ మానసిక ఆరోగ్యంతో లింక్ చేయడం ద్వారా పలు వివరాలను వెల్లడించారు.

ఫాంటమ్‌ ప్రెగ్నెసీకి కారణాలు..

ఒక మహిళకు గర్భం దాల్చాలనే బలమైన కోరిక ఉన్నప్పుడు, ఆమెకు అనేకసార్లు గర్భస్రావాలు జరిగినప్పుడు, తల్లి కావడంలో స్త్రీ పై చాలా ఒత్తిడి ఉన్నప్పుడు లేదా ఆమె మనస్సులో గర్భం దాల్చుతున్నానని అనుకుంటున్నప్పుడు.. అది ఎండోక్రైన్ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. దీని వల్ల గర్భం దాల్చకుండానే మహిళలో ప్రెగ్నెన్సీ లక్షణాలు వస్తాయి. దీన్నే ఫాంటమ్‌ ప్రెగ్నెన్సీ అంటారు.

కొన్నిసార్లు శరీరంలోని కొన్ని హార్మోన్ల మార్పుల కారణంగా తప్పుడు గర్భం యొక్క లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఈ లక్షణాలు అలసట, సక్రమంగా లేని రుతుక్రమం, తలనొప్పి, రొమ్ము పరిమాణంలో మార్పు, వాంతులు, కడుపు ఉబ్బరం, గ్యాస్, వికారం లా వస్తాయి. ఈ క్రమంలో మహిళల్లో మానసిక అస్థిరత ఏర్పడుతుంది.

చాలా మంది మహిళలు శిశువు కదలిక, తన్నడం గురించి కూడా గందరగోళానికి గురవుతారు. అటువంటి పరిస్థితులలో వాటిని వివరించడం చాలా కష్టం. వారి చికిత్స కోసం మానసిక నిపుణుల సహాయం తీసుకోవాలి. అవసరమైతే గైనకాలజీ నిపుణుల సహాయం కూడా తీసుకోవాలి. అల్ట్రాసౌండ్, ఇతర పరీక్షలు చేయించి, ఆమె లక్షణాలు గర్భం దాల్చినట్లుగా ఉన్నాయని నిర్ధారించుకోవాలి. కేవలం లక్షణాలు కనిపిస్తే.. గర్భం ధరించినట్లే అని ఫిక్స్‌ అయిపోకుండా.. వైద్యులను సంప్రదించాలి..ఒకవేళ ఫాంటమ్‌ ప్రెగ్నెస్సీ అయితే అందుకు తగిన చికిత్స ప్రారంభించవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news