పెళ్ళి చేసుకోబోతున్నారా? ఐతే ఈ టిప్స్ మీకోసమే..

-

పెళ్ళి చేసుకోబోయే ముందు లక్ష అనుమానాలు, సందేహాలు బుర్రలో తిరుగుతుంటాయి. పెళ్ళి చేసుకోవాలా వద్దా అనే సందేహం నుండి చేసుకుంటే లాభాలేంటి? చేసుకున్నాక ఎలా ఉండాలి? అసలు ఒకరిని తమ జీవితంలోకి ఎలా ఆహ్వానించాలనే విషయం మీద అనేక ప్రశ్నలు బుర్రని తొలిచేస్తూ ఉంటాయి. ఎందుకంటే అప్పటికే తమ తోటి స్నేహితుల పెళ్ళి జీవితాలని చూస్తుంటారు కాబట్టి, ఈ మాత్రం సందేహాలు కామనే. ఇలాంటి సందేహాలే మీకూ ఉన్నట్లయితే ఒక్కసారి ఇది చదివి అర్థం చేసుకోండి. పెళ్ళి చేసుకున్నాక ఎలా ఉండాలి? ఎలా ఉంటే మీ జీవితం సంతోషంగా ఉంటుందో ఒక్కసారి తెలుసుకుందాం.

పెళ్ళి చేసుకున్నాక కాంప్రమైజ్ అవడం కామన్.. రెండు వేర్వేరు బ్రెయిన్లు ఒకేలా ఆలోచించలేవు కాబట్టి కొన్ని నిర్ణయాలు తీసుకునేటపుడు కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది. ఎవరో ఒకరు ఏదో విషయంలో ఎప్పుడో ఒకసారి కాంప్రమైజ్ అవ్వాల్సిందే. ఇక్కడ కాంప్రమైజ్ కి త్యాగానికి చాలా తేడా ఉంది. ఒక విషయం మీకు నచ్చి, అది అవతలి వారికి నచ్చక వారికోసం ఆ పని చేయకుండా ఉండడం వరకూ ఓకే. అంతే కానీ మీకు నచ్చిన విషయాన్ని పూర్తిగా మర్చిపోవడం, త్యాగం చేయడం కరెక్ట్ కాదు. మీ ఇద్దరికీ నచ్చే ఒక కామన్ పాయింట్ ఉంటుంది. అది సృష్టించుకుని మీకు నచ్చిన పనులని చేసుకోండి.

ప్రతీదానికి పిల్లలని ముందు పెట్టకండి. కొన్ని కొన్ని సార్లు మీరిద్దరు మాత్రమే బయటకు వెళ్ళగలిగేలా ఉండాలి. అది మీ మధ్య ప్రేమను మరింత పెంచుతుంది. నిద్రపోయే సమయం ఇద్దరిదీ ఒకేలా ఉంటే బాగుంటుంది. అది మీ మధ్య భద్రతని ఇంకా పెంచుతుంది. మిమ్మల్ని ఇంకాస్త దగ్గరకు చేస్తుంది. బంధంలో ఏదైనా గొడవలొస్తే బ్రేకప్ ఒక్కటే మార్గంలా ఉండకూడదు. ఒకరి బ్యాంకు అకౌంట్లు మరొకరికి తెలిసేలా ఉంటే నమ్మకం ఇంకా పెరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news