నైట్‌ లైట్‌ ఆన్‌చేసే పడుకుంటున్నారా..? అయితే ఈ సమస్యలు తప్పవుగా..

-

ప్రశాంతమైన నిద్రను ఎవరు కోరుకోరు చెప్పండి.. కానీ ఈరోజుల్లో కంటినిండా నిద్రపోవడం అనేది కడుపునిండా తినడం కంటే కష్టమవుతుంది. ఎవేవో కారణాల వల్ల నిద్రలేమితో ఎంతోమంది అర్థరాత్రుళ్లు జాగారాలు చేస్తున్నారు. ప్రశాంతంగా నిద్రపోవడం వల్ల మెదడు సరిగ్గా పని చేస్తుంది. దీని కారణంగా కండరాలు బలంగా మారుతాయి.. అంతేకాకుండా మానసిక స్థితి కూడా మెరుగవుతుంది. నిద్రపోయేప్పుడు కొందరు లైట్లు అలానే ఉంచి పడుకుంటారు.. అలా చేయడం మంచి పద్ధతి కాదంటున్నారు నిపుణులు..కరెంట్‌ బిల్‌ ఎక్కువస్తుందన్న సమస్య పక్కన పెడితే..ఇంకా చాలా నష్టాలు ఉన్నాయంట…

లైట్లు వెలిగించి నిద్రపోవడం వల్ల కలిగే నష్టాలు..

డిప్రెషన్..

స్వీడన్, నార్వే వంటి ధ్రువ దేశాలలో వేసవి కాలంలో దాదాపు 6 నెలల పాటు సూర్యుడు అస్తమించడు అని మీరు వినే ఉంటారు. రాత్రి వేళ తక్కువగా ఉంటుంది. దీంతో చాలా మంది డిప్రెషన్‌కు గురవుతుంటారు. మరోవైపు భారత్ లాంటి దేశాల్లో వెలుతురులో పడుకోవాలంటే ఎలక్ట్రానిక్ లైట్లను వాడతారు. వీటి నుంచి వెలువడే నీలి కాంతి మిమ్మల్ని చికాకు కలిగిస్తుంది. కావున వీలైనంత తక్కువ వెలుతురులో పడుకోవడం మంచిది.

రక్తపోటు…

మీరు నిరంతరం లైట్లు వెలిగించి నిద్రపోతుంటే మీ ప్రశాంతమైన నిద్రకు భంగం కలుగుతుంది. కాంతి వల్ల నిద్ర పట్టదు. ఇది అధిక రక్తపోటు, గుండె జబ్బులు మొదలైన అనేక వ్యాధుల ప్రమాదానికి దారి తీస్తుంది. అందువల్ల, లైట్లు వేసుకుని నిద్రపోవడం మానుకోండి.

అలసట..

సాధారణంగా లైట్లు వేసుకుని నిద్రపోవడం వల్ల త్వరగా నిద్ర పట్టదు. దాని ప్రభావం మరుసటి రోజు కనిపిస్తుంది. సరిగ్గా నిద్రలేకపోతే యాక్టివ్‌గా ఉండలేరు. ఏ పని సరిగ్గా చేయలేరు. బాగా అలసిపోయిన ఫీల్‌ ఉంటుంది. ఇది పని చేయడాన్ని కష్టతరం చేస్తుంది. ఎందుకంటే మీరు అలసట, ఏకాగ్రత కోల్పోవడం వల్ల బద్ధకం బారిన పడతారు.

కాబట్టి.. బద్దకం చేతనో, మరే కారణం చేతనే లైట్స్‌ ఆన్‌ చేసే పడుకునే అలవాటు ఉంటే.. వెంటనే అది మానేయమంటున్నారు నిపుణులు.

Read more RELATED
Recommended to you

Latest news