నిద్రపోయేప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది. కొందరికి లైట్ వేస్తే నిద్రరాదు.. మరికొందరికి లైట్ తీస్తే నిద్రరాదు..కొంతమంది దుప్పటి లేకుండా నిద్రపోరు. ఇంకో బ్యాచ్ ఉంటుంది..అసలు దుప్పటి కప్పుకోరు. కానీ బాగా చలిగా ఉన్నప్పుడు మొత్తం దుప్పటి కప్పుకుని పడుకుంటే ఉంటుంది ఆ మజానే వేరు. హాయిగా నిద్రపోచ్చు. అయితే దుప్పటి కప్పుకుని పడుకోవడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయట.. అందులోనూ బరువైన దప్పట్ల వల్ల ఇంకా ఎక్కువట.. అవేంటంటే..!
బరువైన మెత్తటి దుప్పటి కప్పుకోవడం వల్ల ఆందోళన తగ్గుతుందట. ఇది కౌగిలించుకున్న లేదా ఎవరో పట్టుకున్న అనుభూతికి సమానమైన ఒత్తిడిని, శరీరానికి హాయిని కలిగిస్తుంది. ఒత్తిడి సాధారణంగా స్వయం ప్రతిపత్త నాడీ వ్యవస్థను విశ్రాంతి మోడ్‌లోకి తీసుకెళ్తుంది. తరచుగా వచ్చే గుండె కొట్టుకోవడం వంటి ఆందోళన లక్షణాలను తగ్గించడంలో ఇది సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.
మనం గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది అదే బరువైన మెత్తటి దుప్పటి కప్పుకోవడం వాళ్ళ అదనపు వెచ్చదనాన్ని అందించడంలో ఇది సహకరిస్తుంది. సరైన నిద్రలేకపోతే.. హార్మోన్ల పనితీరుకి తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. ఇటీవల కొన్ని అధ్యయనాలు బరువైన మెత్తని దుప్పట్లని వినియోగించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.
ఈ సమస్య ఉన్నవాళ్ళుకు వద్దు..
అయితే బరువైన దుప్పటి అందరికీ సరిపోదని నిపుణులు అంటున్నారు.. దీర్ఘకాలిక శ్వాసకోశ లేదా రక్తప్రసరణ సమస్యలు, ఆస్తమా, తక్కువ రక్తపోటు, స్లీప్ అప్నియా లేదా క్లాస్ట్రోఫోబియా వంటి పరిస్థితులు ఉన్నవారు దీన్ని ఉపయోగించకూడద. ఎందుకంటే ఇందులోని గాజు పూసలు బయటకి వచ్చి ప్రమాదంగా మారే అవకాశం ఉంది. ఆందోళనను తగ్గించడంలో బరువున్న దుప్పట్లు తగిన చికిత్స సాధనం కావచ్చు కానీ.. ఇలాంటి సమస్యలు ఉన్నవారికి లేనిపోని సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం కూడా లేకపోలేదు..
బరువు దుప్పటి ఎలా రూపొందించారు?
బరువైన దుప్పటి 1997లో కనిపెట్టారంట. కీత్ జివాలిచ్ అనే వ్యక్తి దీన్ని కనిపెట్టాడు.అతను దాన్ని రూపొందించడానికి డీప్ ప్రెజర్ టచ్ స్టిమ్యులేషన్ థెరపీ (DPTS)ని ఉపయోగించాడు. మైక్రో గ్లాస్ పూసలు, ఉక్కు పూసలు, గులకరాళ్ళు, ఇసుకతో పాటు కొన్ని రకాల ధాన్యాలు వంటి వాటిని ఉపయోగించి ఈ బరువున్న దుప్పటిని తయారు చేశారు.