పిండి ముద్దను ఫ్రిడ్జ్‌లో పెట్టుకోని వాడుతున్నారా..?

-

చాలా మంది ఫ్రిడ్జ్‌లో పెట్టకూడనివి అన్నీ పెడుతుంటారు. అలా రోజుల తరబడి కూరగాయలు, కూరలు, గుడ్లు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోని వాటిని తినడం వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్యం దెబ్బతింటుంది. గోధుమపిండి, మైదాపిండి లాంటి వాటితో వంటలు చేసుకున్నప్పుడు పిండి ముద్ద మిగిలితే.. అందరూ వాటిని ఫ్రిడ్జ్‌లో స్టోర్‌ చేసుకుంటారు. మళ్లీ మరుసటి రోజు వాటిని వాడేదానికి ఒక గంట ముందు బయట పెడితే సరి మెత్తగా అయిపోతుంది కదా..! కానీ ఇలా పిండి ముద్దలను పెట్టొద్దు అంటున్నారు నిపుణులు..? ఎందుకు.. ఏమైతది..?

Pizza Dough Recipe | Bobby Flay | Food Network

వర్షాకాలంలో ఏ ఆహారం తింటున్నామన్నది చాలా ముఖ్యం.. అంటే ఎండాకాలం ఏం తిన్నా పర్వాలేదా అంటారేమో..? అవును ఎక్కువగా అంటురోగాలు వచ్చేది వర్షాకాలంలోనే. అందుకే ఈ టైమ్‌లో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కావాలి. ఏం తింటున్నాం, ఎలా తింటున్నాం ఇవన్నీ చూసుకోవాలి. ప్యాక్ చేసి ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారాన్ని తర్వాత వాడితే ప్రమాదకరం కాగలదు.

చాలా మంది చపాతీలు వేసుకునేవారు పెద్ద పిండి ముద్దను కలిపి దాన్ని ఫ్రిజ్‌లో పెట్టి రోజూ కొద్దికొద్దిగా తీసి చపాతీలు చేసుకొని తింటుంటారు. ఇలా నీరు కలిపి ఉంచిన పిండి ముద్దలో బ్యాక్టీరియా, ఫంగస్ పెరుగుతుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్‌కి దారితీస్తుంది. అంతేకాదు ఏసీడీటీ, మలబద్ధకం సమస్యలు కూడా వస్తాయి.

చాలా వరకు బ్యాక్టీరియా తక్కువ ఉష్ణోగ్రతలో పెరుగుతుందని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు నిరూపించాయి. లిస్టెరియా మోనోసైటోజెన్స్ అనే బ్యాక్టీరియా వల్ల చాలా రకాల తీవ్రమైన వ్యాధులు వస్తాయి. ఇది తక్కువ ఉష్ణోగ్రతలో బాగా పెరుగుతుంది. ఫ్రీజ్‌లో తక్కువ ఉష్ణోగ్రత కారణంగా బ్యాక్టీరియా బాగా పెరుగుతుంది. అందుకే ఫ్రిజ్‌లో ఏదైనా ఉంచినప్పుడు శుభ్రమైన ప్రదేశంలోనే చేయాలి. అలాగే ఫ్రిజ్‌ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.

వర్షాకాలంలో తాజా ఆహారాన్ని మాత్రమే ఉపయోగించాలి. ఎప్పటికప్పుడు దాన్ని వండుకోవాలి. వేడివేడిగా ఉండే ఆహారమే తినాలి. నీరు కలిపిన మైదా లేదా గోధుమ పిండి ముద్దను ఫ్రిజ్‌లో ఉంచాల్సి వస్తే అందులో ఎక్కువ నీరు లేకుండా చూసుకోవాలి. దాన్ని గాలి చేరని కంటైనర్‌లో ఉంచి మాత్రమే ఫ్రిజ్‌లో పెట్టాలి. అది కూడా ఒక్క రోజుకి మించి ఉంచొద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు

Read more RELATED
Recommended to you

Latest news