పీఎఫ్ డబ్బులు డ్రా చేస్తున్నారా? ఇలా చెయ్యకుంటే డబ్బులు రావు..

-

మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే డబ్బులు డ్రా చేస్తున్నారా?అయితే మీకో గుడ్ న్యూస్. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈపీఎఫ్ ఖాతాదారులకు ఓ వరం ఇచ్చారు. ఈపీఎఫ్ విత్‌డ్రాయల్స్‌కు ప్రస్తుతం ఉన్న ట్యాక్స్ డిడక్టెట్ ఎట్ సోర్స్‌ను 10 శాతం తగ్గించారు. నాన్-పాన్ కేసుల్లో విత్‌డ్రాయల్స్‌పై 30 శాతం టీడీఎస్ ఉండేది. ఇప్పుడు 20 శాతానికి తగ్గిస్తున్నట్టు కేంద్ర మంత్రి ప్రకటించారు. ఆ కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి.. పాన్ ను అప్లై చెయ్యని వాళ్ళకు టీడీఎస్ వర్తిస్తుంది. ఈ టీడీఎస్ గతంలో 30 శాతం ఉండగా, కొత్త బడ్జెట్ అమలులోకి రావడంతో 20 శాతం టీడీఎస్ రూల్ వచ్చింది..

మీరు ఈ అకౌంట్ నుంచి కొన్ని కారణాల వల్ల డబ్బులను డ్రా చేసుకోవచ్చు..ఐదేళ్ల సర్వీస్ పూర్తి కాకముందు ఈపీఎఫ్ డబ్బులు డ్రా చేస్తే 10 శాతం టీడీఎస్ చెల్లించాలి. అందుకే డబ్బులు డ్రా చేసేముందు తప్పనిసరిగా పాన్ నెంబర్ ఇవ్వాలి. లేకపోతే కొత్త నిబంధనల ప్రకారం 20 శాతం టీడీఎస్ చెల్లించాలి. ఐదేళ్ల సర్వీస్ పూర్తి కాకముందు రూ.50,000 లోపు విత్‌డ్రా చేస్తే టీడీఎస్ వర్తించదు. రూ.50,000 మించితేనే టీడీఎస్ వర్తిస్తుంది. అయితే పాన్ కార్డ్ లేదా ఫామ్ 15జీ లేదా 15హెచ్ సబ్మిట్ చేస్తే టీడీఎస్ చెల్లించాల్సిన అవసరం లేదు..

ఐదేళ్ల కన్నా ముందే డ్రా చేస్తే వారి పాన్ కార్డ్ వివరాలు లేనప్పుడు టీడీఎస్ వర్తిస్తుంది. అంటే జీతం, ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ, మ్యూచువల్ ఫండ్స్ , డివిడెండ్లు, ఇతర ఆదాయాలకు ముందుగానే టీడీఎస్ వసూలు చేసినట్టు, ఈపీఎఫ్ విత్‌డ్రాయల్స్‌కు కూడా టీడీఎస్ ఉంటుంది. పన్నుచెల్లింపుదారులు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేప్పుడు టీడీఎస్ క్లెయిమ్ చేసుకొని రీఫండ్ పొందొచ్చు. ఇక సర్వీస్ ఐదేళ్లు పూర్తైనవారు పీఎఫ్ డబ్బులు డ్రా చేస్తే వారికి పన్ను నుంచి మినహాయింపు లభిస్తుంది.. వారు ఎటువంటి టాక్స్ ను చెల్లించాల్సిన అవసరం లేదు..

Read more RELATED
Recommended to you

Latest news