రిపోర్ట్ లో రఘురామ కృష్ణం రాజు కండిషన్ నార్మల్ అని ఉంది అని ఆయకు ఎలాంటి బహిర్గత గాయాలు లేవని స్పష్టంగా ఉందని ప్రభుత్వ న్యాయవాది దవే సుప్రీం కోర్ట్ లో తన వాదనలు వినిపించారు. ఆర్మీ ఆస్పత్రికి తరలించేటప్పుడు అంబులెన్సులో వెళ్లేందుకు రాజు నిరాకరించారు అని అన్నారు. ఆయన కార్లో స్వయంగా వెళ్లారు ఈ సందర్భంగా కోర్ట్ కి వివరించారు. హాయిగా చేతులు ఊపుతూ ఉన్నారు అని అన్నారు.
కాళ్లు కదుపుతూ ఉన్నారు అని ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు అని తెలిపారు. పెడల్ ఎడిమా అనేది ఆరోగ్య సంబంధిత అంశాల కారణంగా ఏర్పడుతుంది. ఇందులో ఎలాంటి చిత్రహింసల ప్రమేయం లేదు అని స్పష్టం చేసారు. పాదంలోని వేలికి ప్రాక్చర్ (బోన్ వేరుపడలేదు – Undisplaced ఫ్రాక్చర్) అని ఉంది అన్నారు. పోలీసులు టార్చర్ చేయాలనుకుంటే ఒక కాలి రెండో వేలు మీద మాత్రమే చేస్తారా అని నిలదీశారు. దేశంలో ఏ పోలీసు కూడా ఒక ఎంపీతో దురుసుగా ప్రవర్తించరు అని స్పష్టం చేసారు. అంతకు ముందు ఎలాంటి ఫ్రాక్చర్ లేదని ఎక్స్-రే రిపోర్టులు ఉన్నాయన్నారు.