బిగ్ బ్రేకింగ్; తాట తీస్తారు రోడ్ మీదకు వస్తే.. చెప్పినట్టుగానే ఆర్మీని దింపిన కేసీఆర్…!

-

తెలంగాణాలో లాక్ డౌన్ అయినా సరే ప్రజలు రోడ్ల మీదకు వస్తున్న ప్రజలను కట్టడి చేయడానికి గాను తెలంగాణాలో కేంద్ర బలగాలు దిగాయి. ప్రజలు మాట వినకపోతే అర్మీని దింపుతామని ముందుగానే చెప్పిన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన పని చేసారు. పోలీసులకు ప్రజలు మాట వినకపోవడంతో కేంద్రాన్ని కెసిఆర్ విజ్ఞప్తి చేసారు. దీనితో కేంద్రం స్పందించి వెంటనే కేంద్ర బలగాలను పంపింది.

లాక్ డౌన్ ప్రకటించినా సరే ప్రజలు మాత్రం మాట వినే పరిస్థితి తెలంగాణాలో కనపడటం లేదు. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ప్రజలు చిన్న చిన్న అవసరాల కోసం కూడా రోడ్డు మీదకు వచ్చి ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. పోలీసులు అమ్మా అని చెప్పినా వినడం లేదు అయ్యా అని చెప్పినా వినడం లేదు. లాఠీ చార్జ్ కి కూడా తెలంగాణాలో కొందరు అలవాటు పడిపోయారు. దీనితోనే కేంద్ర బలగాలను దింపాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటి వరకు పోలీసులు చెప్పింది ఒక ఎత్తు ఇప్పుడు కేంద్ర బలగాలు చెప్పింది ఒక ఎత్తు. ఉదాహరణ చెప్పమంటారా…? వాళ్లకు తెలుగు రాదు. దాదాపు వాళ్ళు అసోం నుంచి వచ్చే వాళ్ళే ఉంటారు. వాళ్లకు హింది కూడా సరిగా రాదు. కాబట్టి మీ భాష వాళ్లకు అర్ధం అయ్యే పరిస్థితి ఉండదు. రోడ్డు మీదకు వస్తే మాత్రం తాట తీసి ఒలిచేస్తారు. కాబట్టి ఇళ్ళల్లో ఉండటం మంచిది. పోలీసులు ఉన్నంత ప్రశాంతంగా వాళ్ళు ఉండరు. జాగ్రత్తగా ఉండండి…

Read more RELATED
Recommended to you

Latest news