ఇటీవల ఇండియన్ ఆర్మీకి చెందిన చీతా హెలికాప్టర్ కు జరిగిన ప్రమాదం మరవకముందే ఇవాళ మరో ప్రమాదం చోటుచేసుకుంది. అరుణాచల్ ప్రదేశ్లోని మిగ్గింగ్ గ్రామంలో భారత సైన్యానికి చెందిన ఓ హెలికాప్టర్ కూలిపోయింది. ఎగువ సియాంగ్ జిల్లా ట్యూటింగ్ ప్రధాన కార్యాలయం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఇవాళ ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
ప్రమాద స్థలానికి రోడ్డుతో అనుసంధానం లేదని ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. ప్రస్తుతం ఘటన ప్రదేశానికి సహాయక బృందాలు చేరుకున్నాయని తెలిపింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇదే నెలలో అరుణాచల్ ప్రదేశ్లో చోటుచేసుకున్న రెండో ఘటన ఇది. తవాంగ్ సమీపంలో చీతా హెలికాప్టర్ కూలిపోవడంతో ఒక పైలట్ మరణించారు. మరికొందరు గాయపడ్డారు.