నాపై ట్రోలింగ్ చూస్తుంటే నవ్వొస్తుంది : బౌలర్ అర్షదీప్ సింగ్

-

ఆసియా కప్‌ లో భాగంగా ఆదివారం ఇండియాపై పాక్‌ గెలిచిన సంగతి తెలిసిందే. అయితే..ఈ మ్యాచ్‌ లో టీమిండియా ఓ రికార్డును నమోదు చేసుకుంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ కు దిగిన టీమిండియాకు ఓపెన్లు రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ మంచి ఆరంభాన్ని అందించారు. అయితే.. భారత బ్యాటర్లు ఆకట్టుకున్న, బౌలర్లు విఫలం కావడంతో హోరా హోరి లో దాయాదిదే పై చేయి అయింది. ముఖ్యంగా 18వ ఓవర్లో రవి బిష్నోయి బౌలింగ్ లో అర్షదీప్ జారవిడిచిన క్యాచ్ వల్ల రోహిత్ సేన భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది.

అర్షదీప్ తప్పిదంతో బతికిపోయిన ఆటగాడు ఆసిఫ్ ఆలీ, ఆ తర్వాతి ఓవర్లో భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో సిక్స్, ఫోర్ బాదాడు. దీంతో పాక్ గెలిచింది. కీలకమైన సమయంలో అర్షదీప్ క్యాచ్ నేలపాలు చేయడంతో ఉత్కంఠంగా మ్యాచ్ వీక్షిస్తున్న అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆర్షదీప్ సింగ్ సునాయాస క్యాష్ ను వదిలేసిన సమయంలో ఆసిఫ్ ఆలీ ఒక్క పరుగు కూడా చేయలేదు.

ఈ జీవనాధారం అనంతరం ఆసిఫ్ ఓ సిక్స్, రెండు ఫోర్లు బాది పాకు విజయానికి బాటలు వేశాడు. ఆసిఫ్ ఎనిమిది బంతుల్లో 16 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. ఒకవేళ ఆర్షదీప్ ఆ క్యాచ్ ను పట్టి ఉంటే చేజింగ్ లో పాకిస్తాన్ వెనకబడేది. అప్పుడు ఫలితం మరోలా ఉండేది. కీలక క్యాచ్ ను వదిలేసిన ఆర్షదీప్ పై సోషల్ మీడియాలో మీమ్స్, కామెంట్స్ వర్షం కురుస్తోంది. ‘నేటి మ్యాచ్ లో ఆర్షదీప్ విలన్’ అని ఒకరు కామెంట్ చేయగా, ‘డ్రెస్సింగ్ రూమ్ లో ఆర్షదీప్ కు ఉంది పో’ అని ఇంకొకరు ట్వీట్ చేశారు.

అర్షదీప్ సింగ్ కనబడితే కాల్ చేస్తా అన్నట్టుగా, ఓ ముగ్గురు బైక్ పై బయలుదేరిన మీమ్ నవ్వులు పూయిస్తోంది. అయితే పాకిస్తాన్ తో మ్యాచ్ లో క్యాచ్ వదిలేయడంతో నేటిజెన్ల అగ్రహానికి గురైన టీమిండియా పేసర్ ఆర్షుదీప్ సింగ్ తాజాగా స్పందించాడు. ‘ఈ ట్వీట్లు, మెసేజ్ లు చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. వీటిని నేను పాజిటివ్ గానే తీసుకుంటా. ఈ ఘటన నాకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తోంది’ అని ఆర్షుదీప్ చెప్పాడు. కాగా ప్రతి క్రికెటర్ తన దేశం గెలవాలనే కోరుకుంటాడని, ఎవరు ఓడిపోవాలని చూడరని ఆర్షుదీప్ తండ్రి దర్శన్ సింగ్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news