అవును.. షుగర్ ఫ్రీ అన్నా… నో షుగర్ అన్నా.. కృత్రిమ తీపి పదార్థాలు అన్నా… ఆర్టిఫిషియల్ స్వీటనర్స్.. ఏదైనా ఒకటే. వీటివల్ల ఆరోగ్యానికి ప్రమాదమే కాని.. వీటివల్ల మంచి జరుగుతుందని ఎక్కడా నిరూపితం కాలేదని పరిశోధకులు చెబుతున్నారు.
జర్మనీకి చెందిన యూనివర్సిటీ ఆఫ్ ఫ్రీబర్గ్ రీసెర్చర్స్ దీనిపై అధ్యయనం చేశారట. ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ తీసుకునే వాళ్లకు ఎటువంటి మంచి ఫలితాలు రాలేదట. వాళ్ల ఆరోగ్యంపై షుగర్ ఫ్రీ పదార్థాలు చెడు ప్రభావం చూపించాయట. అందుకే.. షుగర్ ఫ్రీ పదార్థాలను ఎంత తగ్గిస్తే అంత మంచిదని చెబుతున్నారు రీసెర్చర్లు. వీటిని ఎక్కువగా తీసుకునే వాళ్లలో బరువు పెరగడం, బ్లడ్ షుగర్ సమస్యలు, ఓరల్ హెల్త్, క్యాన్సర్, కార్డియో వాస్కులర్ వ్యాధులు, కిడ్నీ సమస్యలు, ఇతర మానసిక సమస్యలు వస్తున్నట్టు రీసెర్చర్లు గుర్తించారు.