నేడు కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం.. వెంటనే జీహెచ్ఎంసీలో ?

తెలంగాణ గవర్నర్ కోటాలో ఎన్నికైన ముగ్గురు ఎమ్మెల్సీలు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కవి, గాయకుడు గోరేటి వెంకన్న, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, ఆర్యవైశ్య సంఘ నాయకుడు బొగ్గవరపు దయానంద్ గుప్తాలను ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసింది. దీనికి గవర్నర్ తమిళిసై కూడా ఆమోదముద్ర వేశారు. ఇక కొత్తగా ఈ ముగ్గురు ఎమ్మెల్సీల నియామకంతో తెలంగాణా శాశన మండలిలో మొత్తం నలభై స్థానాలు భర్తీ అయ్యాయి.

అలాగే వీరు ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన వెంటనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో  ఎక్స్ అఫీషియో సభ్యులు గా కూడా నమోదు చేసుకోనున్నారు. అసలు వీరి నియామకమే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కు సంబంధించిన మేయర్ పీఠం కోసం అనే వాదన కూడా వినిపిస్తోంది. మేయర్ ని ఎన్నుకోవడంలో కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫిషియో సభ్యులు పాత్ర కూడా కీలకంగా ఉంటుంది. తమకు ఆ విషయంలో మెజారిటీ ఉండాలని భావించిన ప్రభుత్వం ఇప్పటికిప్పుడు వీరందరినీ నియమించినట్లు భావిస్తున్నారు.