బియ్యం లేక కింగ్ కోబ్రాను చంపి తినేసిన యువ‌కులు.. చివ‌ర‌కు ఏం జ‌రిగిందంటే..?

-

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల‌ను తీవ్ర స్థాయిలో వ‌ణికిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే 210 దేశాలకు వ్యాప్తిచెందిన ఈ మ‌హ‌మ్మారి ప్ర‌జ‌ల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తుంది. క‌రోనా క‌రోనా వైర‌స్ వ‌ల్ల చ‌నిపోతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. ఇప్ప‌టికే ఈ మ‌హ‌మ్మారి ప్ర‌పంచ‌వ్యాప్తంగా 1.60 ల‌క్ష‌ల మంది ప్రాణాలు బ‌లితీసుకుంది. ఇక ఈ మ‌ర‌ణాల్లో మూడో వంతు యూరప్‌లోనే సంభ‌వించ‌డం గ‌మ‌నార్హం. అయితే మ‌హ‌మ్మారిని మ‌ట్టుపెట్టేందుకు ప‌లు దేశాలు లాక్‌డౌన్ విధించిన సంగ‌తి తెలిసిందే.

దీంతో ప్ర‌జ‌లంద‌రూ ఇంటికే ప‌రిమితం అయ్యాయి. ఈ క్రమంలోనే కొందరికి తినేందుకు తిండిలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి వారికి లాక్‌డౌన్ పెద్ద స‌వాల్‌గా మారింది. అయితే ఇలాంటి వారే కొంద‌రు వండుకోవ‌డానికి బియ్యం లేక ఏకంగా భయంకరమైన విషసర్పంగా పేరున్న కింగ్ కోబ్రాను చంపి తినేశారు. అంతేకాకుండా.. దాన్ని ఫోటోలు తీసి సోష‌ల్ మీడియాలో కూడా పెట్టారు. కానీ, ఆ త‌ప్పే వారిని క‌ట‌క‌టాల‌పాలు చేసింది. ఈ ఘ‌ట‌న అరుణాచల్ ప్రదేశ్ అడవుల్లో జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. వీరు పోస్ట్ చేసిన వీడియో ప్ర‌కారం.. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌కు చెందిన కొంద‌రు యువ‌కులు వండుకోవ‌డానికి వారి ఇళ్లల్లో బియ్యం లేవు.

Amid lockdown, illegal hunting of wild animals spikes in Northeast ...

దీంతో ఏదైనా తినేందుకు తెచ్చుకోవాలని అడవికి వెళ్లగా, కింగ్ కోబ్రా కనిపించింది. అయితే దాన్నే ఆహారంగా చేసుకోవాలని వారు డిసైడ్ అయ్యారు. ఈ క్ర‌మంలోనే ఓ గ్రూప్ గా కలిసిన వేటగాళ్లు సుమారు 12 అడుగల పొడవున్న పామును చంపి వండుకుని తినేశారు. ఆ త‌ర్వాత దీనికి సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో పెట్ట‌గా.. అవి కాస్త వైర‌ల్ అయ్యారు. దీంతో స్పందించిన అధికారులు వన్యప్రాణి రక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. కింగ్ కోబ్రా ఈ చట్టం ప్రకారం రక్షిత సర్పం. ఈ నేరానికి వారికి బెయిల్ కూడా లభించదు. అయితే ఈ వీడియోలో కనిపించిన యువకులు ప్రస్తుతం పరారీలో ఉన్నాట్టు తెలుస్తోంది. వారి కోసం పోలీసుల తీవ్రంగా గాలిస్తున్నార‌ట‌.

Read more RELATED
Recommended to you

Latest news