చంద్రబాబుకి టీఆర్ఎస్ ఇచ్చిన గౌరవం…

-

ఆంధ్రప్రదేశ్ మాజీ సిఎం, తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు నేడు. దీనితో ఆయనకు పలువురు శుభాకాంక్షలు చెప్తున్నారు. తెలంగాణా, కర్ణాటక, ఏపీ రాష్ట్రాల నుంచి ఆయనకు అభినందనలు ఎక్కువగా వస్తున్నాయి. ఇక తెలంగాణా నుంచి ఆయనకు శుభాకాంక్షలు భారీగా వెళ్తున్నాయి. ఈ సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.

 

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న సమయంలో… కేసీఆర్ తెలుగుదేశంలో ఉన్నారు. ఆయన అప్పుడు మాట్లాడిన మాటలను వీడియోల రూపంలో పోస్ట్ చేస్తున్నారు. అదే విధంగా మంత్రి కేటిఆర్ మాట్లాడిన మాటలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఐటి రంగంలో చంద్రబాబు తీసుకొచ్చిన మార్పులను, అలాగే జినోమ్ వ్యాలీ ని చంద్రబాబు తీసుకొచ్చారని శాసన సభలో మాట్లాడిన వీడియో లను పోస్ట్ చేస్తున్నారు.

ఇక తెరాస లో ఉన్న ప్రస్తుత తెలుగుదేశం మాజీ నాయకులు ఎక్కువగా ఆయనకు శుభాకాంక్షలు చెప్తున్నారు. టీఆర్ఎస్ నేతలు చాలా మంది టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే. కొందరు చంద్రబాబు విధానాలు నచ్చక బయటకు వస్తే మరికొందరు తెలంగాణాలో ఆ పార్టీకి భవిష్యత్తు లేదని వచ్చారు. ఇప్పుడు వాళ్ళు అందరూ కూడా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news