ఢిల్లీ ప్రభుత్వంలో వెలుగు చూసిన లిక్కర్ కుంభకోణంలో విస్తు పోయే విషయాలు బయటకి వస్తున్నాయి. ఈ స్కామ్ కు సంబంధించిన పక్క ఆధారాలు సేకరిస్తుంది సిబిఐఐ. ఈ కేసులో 14 మందితో ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది సిబిఐ. ఏ1 గా ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను చేర్చింది. ఇది ఇలా ఉండగా.. ఈ లిక్కర్ స్కాంపై స్వయంగా ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు భారత రత్న ఇవ్వాలని కొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారు. ఢిల్లీలో ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా.. తీసుకొచ్చిన విద్యా సంస్కరణలు ఎంతో బాగున్నాయని.. దీనిపై ఇతర దేశాలు సైతం ప్రశంసలు కురిపించాయని వివరించారు. సిసోడియా ఎంతో అనుభవమైన నాయకుడన్నారు. బీజేపీకి సీబీఐ, ఈడీ ఉంటే.. తమకు ప్రజలు ఉన్నారని… ధర్మం తమవైపు ఉందని చెప్పారు. బీజేపీ పార్టీతో ధర్మ యుద్ధం చేస్తున్నామని.. తమను బీజేపీ ఏం చేయలేదని తేల్చి చెప్పారు కేజ్రీవాల్.