కర్ణాటకలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్రం భారీ నజరానాను ప్రకటించింది. ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో ఎక్కువ భద్ర ప్రాజెక్టుకు కేంద్రం 5300 కోట్ల సాయం అందించనుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఎగువ భద్ర ప్రాజెక్టులో తుంగా నది నుంచి భద్ర జలాశయానికి 17.40 మిలియన్ క్యూబిక్ అడుగుల నీటిని భద్ర రిజర్వాయర్ నుంచి 29.90 టిఎంసిలను ఎగువ భద్ర ప్రాజెక్టులోకి వినియోగానికి ఎత్తివేయాలని భావిస్తున్నారు.
ఎండిపోయిన ప్రాంతాల నీటి అవసరాలను తీర్చడంలో ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి కీలకమైనది. ఈ ప్రాజెక్టుకి 5300 కోట్ల గ్రాంట్ ను ప్రకటించినందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి కర్ణాటక తరఫున ధన్యవాదాలు తెలిపారు ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై.