ఫ్యాక్ట్ చెక్: ప్రభుత్వం ఫ్రీ మెడికల్ కన్సల్టేషన్ సర్వీసులని ఇస్తోందా..?

-

ఈ మధ్య కాలంలో నకిలీ వార్తలు ఎక్కువైపోవడంతో ఏది నకిలీ వార్త ఏది నిజమైన వార్త అనేది తెలియడం లేదు. చాలా మంది ఈ మధ్య కాలం లో ఫేక్ వార్తలు ని విపరీతంగా షేర్ చేస్తున్నారు కానీ ఆ తప్పును చేయకండి. ఎందుకంటే నకిలీ వార్తల వలన మీరు మాత్రమే కాకుండా ఇతరులు కూడా మోసపోవాల్సి వస్తుంది.

తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. మరి అది నిజమా కాదా అనేది ఇప్పుడు చూద్దాం. ఇంటి నుండి ఫ్రీ మెడికల్ కన్సల్టేషన్ సర్వీసెస్ ని పొందచ్చని ఒక వార్త షికార్లు కొడుతోంది. మరి నిజంగా ఫ్రీ మెడికల్ కన్సల్టేషన్ సర్వీసెస్ ని ప్రభుత్వం ఇస్తుందా లేదా దీనిలోని నిజం ఏమిటి అనేది చూద్దాం. ”ఈ- సంజీవిని ఓపిడి ఫ్రీ టెలి కన్సల్టేషన్ సిస్టం” ద్వారా ప్రజలు దేశంలో ఎక్కడ వున్నా స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా డాక్టర్లని కన్సల్ట్ చేయొచ్చని దీనిలో ఉంది.

ఇది నిజమా కాదా అనేది చూస్తే.. ఇది నిజం అని తెలుస్తోంది ఇది నకిలీ వార్త కాదు. ఇది నిజమైన వార్తే, ప్రభుత్వం ఈ సేవలను అందిస్తోంది. కనుక ఇది నకిలీ వార్త కాదని తెలుసుకోండి ఈ సర్వీసులను మీరు కూడా పొందవచ్చు. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీనిపై స్పందించి ఇది నకిలీ వార్త కాదు అని చెప్పేసింది.

Read more RELATED
Recommended to you

Latest news