ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న అసదుద్దీన్ ఓవైసీ దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ దాడి దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. అసదుద్దీన్ ఓవైసీకి ఏమీ జరగలేదు. అయితే దుండగులను పట్టుకున్న పోలీసులు ఎందుకు దాడి చేశారన్నదానిపై ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ప్రచారం ముగించుకుని మీరట్ నుంచి ఢిల్లీకి వస్తున్న క్రమంలో ఛాజర్సీ టోల్గేట్ వద్ద అసదుద్దీన్ కార్ పై దాడి జరిగింది. ఇద్దరు వ్యక్తులు అసద్ వాహనం పై కాల్పులు జరిపారు 3-4 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అసద్ కార్ టైర పంక్చర్ అయింది. అయితే అసద్ అనుచరులు కార్ ను తెలివిగా దుండగుల పైకి పోనివ్వడంతో ప్రమాదం తప్పింది.
ఇదిలా ఉంటే అసదుద్దీన్ పై కాల్పులు జరిపిన ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ‘ హిందూ వ్యతిరేఖ’ వ్యాఖ్యాలపై కలత చెంది దాడి చేసినట్లుగా నిందితులు తెలిపారని పోలీసులు అంటున్నారు. ఎన్నికల ప్రచారంలో హిందూ వ్యతిరేఖ వ్యాఖ్యలపై దాడికి కారణంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఘటనపై విచారణ జరుగుతోంది.