గత వారం రోజుల కిందట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజన పై కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేస్తున్నట్లు జగన్మోహన్ రెడ్డి సర్కారు కీలక ప్రకటన చేసింది. అయితే కొత్త జిల్లాలు ఏర్పడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూముల ధరలకు రెక్కలు రానున్నాయి. కొత్త ఆస్తుల విలువను మార్కెట్లోకి తెచ్చేందుకు జగన్ సర్కారు ఇప్పటికే రంగం సిద్ధం చేసింది.
కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత కొన్ని చోట్ల ఇప్పటికీ భూముల విలువ పెరిగింది. ఆ డిమాండ్ ను ఆదాయంగా మార్చుకునేందుకు ప్రభుత్వం కూడా ఆస్తుల విలువను పెంచనుంది. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త ఆస్తుల విలువ అమలులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామని సర్కార్. ఆస్తుల విలువ పెరుగుతుంది రిజిస్ట్రేషన్ చార్జీల ఖర్చులు కూడా జరుగనున్నాయి.
దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం భారీగా సమకూరింది. నిజానికి గత ఏడాది భూముల విలువలు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేసింది. కానీ అప్పుడు వర్కౌట్ కాలేదు. అయితే జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఇప్పుడు మార్కెట్ విలువ పెంచేందుకు మార్గం సుగమమైంది. ఇక ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి భూములు పెరిగే ఛాన్స్ స్పష్టంగా కనబడుతుంది.