వివాదాస్పద రైతు చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకుంది. విజయవంతంగా పార్లమెంట్ లో ఆమోదించేలా చేసుకుంది. అయితే మరికొన్ని వివాదాస్పద బిల్లులను ఉపసంహరించుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రైతులు కనీస మద్దతు ధర హమీ కోసం బిల్లును ప్రవేశపెట్టాలని.. అలాగే విద్యుత్ సవరణ చట్టాలని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పటి దాకా ఆందోళన చేస్తామని కేంద్రానికి అల్టిమేటం ఇస్తున్నారు రైతులు.
తాజాగా పౌరసత్వ సవరణ బిల్లు చట్టాన్ని సీఏఏని వెనక్కి తీసుకోవాలని ఎంఐఎం హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల ముందు రాజకీయంగా నష్టపోతామనే ఉద్దేశ్యంతోనే కేంద్రం మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నాయని అన్నారు. దేశంలో ఓ పెద్ద సమూహం సీఏఏను రద్దు చేయాలని కోరుకుంటుందని తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు వ్యతిరేఖంగా సీఏఏ ను కేంద్రం తీసుకువచ్చిందని ఆయన ఆరోపించారు.