Ashadam Bonalu 2023 : పోతురాజు ఎవరు..? అతన్ని ఎవరు సృష్టించారు..?

-

ఆషాడమాసం భోనాలు స్టాట్‌ అయ్యాయి. ఇక జూలై అంతా ఉంటాయి. తెలంగాణ వ్యాప్తంగా బోనాలు నెక్ట్స్‌ లెవల్‌లో జరుపుకుంటారు. బోనాల్లో పోచమ్మ, ఎల్లమ్మ, మాంకాళమ్మ, పెద్దమ్మ ఈ దేవతలందిరీ సారె, బోనం సమర్పిస్తుంటారు. అచ్చమైన తెలంగాణ సంస్కృతికి అద్దం అషాడ మాసం బోనాలు, బతుకమ్మ పండుగ. ఇప్పటికే స్టాట్‌ అయ్యాయి.

ujjaini mahankali bonalu
ujjaini mahankali bonalu

ఆషాఢ మాసం ఆరంభం నుంచి ఊరూరా మొదలయ్యే సందడి నెల రోజుల పాటూ సాగుతుంది. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలతో మహానగరం నుంచి మారుమూల పల్లెవరకూ హోరెత్తిపోతుంది. ఉత్సవాల్లో భాగంగా మహిళలు తలపై బోనాలతో అమ్మవార్ల ఆలయాలకు తరలివెళ్లి పూజలు చేస్తారు. గ్రామ దేవతలైన పోశమ్మ, మైసమ్మ, బాలమ్మ, ఎల్లమ్మ, ముత్యాలమ్మ, మహంకాళమ్మ, పెద్దమ్మ, వీరికి తోడుగా గ్రామాన్ని కాపాడే పోతురాజు అనుగ్రహంకోసం బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తారు. అమ్మవార్ల పక్కన పోతురాజు ఉంటాడు కదా. ఈ దేవతలంతా పార్వతీ దేవి సంతానం అంటారు. మరీ ఈ పోతారాజు ఎవరు..?

పార్వతీ దేవి సంతానానికి కాపలా పోతురాజు

శివపార్వతులకు ఓరోజు వనవిహారానికి వెళ్లారు. అక్కడ పార్వతీదేవి కొలనులోంచి ఏడు దోసిళ్ల నీళ్లు తాగగానే సద్యోగర్భంలో ఏడుగురు కన్యలు పుట్టారు. నీళ్లు తాగిన వెంటనే పిల్లలు పుట్టడం ఏంటో అర్థంకాని పార్వతీదేవి వెంటనే పరమేశ్వరుడి చెంతకు చెరింది. ఆ ఏడుగురు కుమార్తెలను వెంట తీసుకెళదామని అడుగుతుంది. వద్దని చెప్పిన శివుడు వారి జన్మరహస్యం వివరిస్తాడు. ఆ ఏడుగురిది స్వతంత్ర ప్రవృత్తి అని అందుకే వారిని వదిలేసి వెళదామంటాడు. మరి వీరికి తోడెవరు అని పార్వతీదేవి అడగడంతో వారికి కాపలాగా ఓ గణాన్ని సృష్టించి పోతురాజు అని పేరు పెడతాడు శివుడు. ఆ ఏడుగురిని పోతురాజే కాపాడాలని చెప్పి పార్వతీ పరమేశ్వరులు అక్కడి నుంచి వెళ్లిపోతారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పోతురాజు ఆ ఏడుగురినీ కాపలా కాస్తూనే ఉన్నాడట. ఆ ఏడుగుర పేర్లు పెరవాణి, శివవాణి, కొండవాణి, ముద్దరాలు, జక్కులమ్మ, కామవల్లి, శర్వాణి. ఈ పేర్లనే పోచమ్మ, ఎల్లమ్మ, మాంకాళమ్మ, పెద్దమ్మ అంటూ ఒక్కో చోటు ఒక్కోలా పిలుస్తున్నారు.

పోతురాజులు వేషం వేసిన వారు రోజంతా ఉపవాసమే

పోతురాజు వేషం వేసే వారు రోజంతా ఉపవాసం ఉంటారు. ఉదయాన్నే స్నానం చేసి అలంకరణ సామాగ్రికి ఇంట్లో పూజలు చేసి అలంకరించుకుంటారు. కొందరు గుడి దగ్గరకు వెళ్లాక అలంకరించుకుంటారు. ఆ వేషం తీసేసిన తర్వాత భోజనం చేస్తారు. ఈ లోగా పళ్లరసాలు తాగుతారు. దాదాపు కేజీ పసుపుకు అర కిలో నూనె కలిపి ఆ మిశ్రమాన్ని శరీరానికి పట్టించుకుంటారు. ఒకప్పుడు కేవలం పసుపు పూత, పెద్ద కుంకుమ బొట్టుకే పరిమితమైన అలంకరణ ఇప్పుడు రకరకాల రంగులకు, రకరకాల ఆకృతులకు మారింది. వాస్తవానికి ఎలాంటి మేకప్ అయినా 10 నుంచి 12 గంటలు ఎండలో, వానలో ఉంటే చెరిగిపోతుంది. అందుకే వీళ్లు నేరుగా పెయింట్‌తో మేకప్ వేసేసుకుంటారు. ఆ మేకప్ తర్వాత వారి మొహంలో వారికే తెలియని గంభీరత వచ్చి చేరుతుంది.

ఈరకోల

పోతురాజులు అనగానే.. వారి చేతిలో కొరడా గుర్తొస్తుంది. కొరడా ఝుళిపిస్తూ వాళ్లు ఆడే ఆట చూసేందుకు జనం గుమిగూడతారు. పోతురాజల ఆటకున్న ప్రత్యేకత అది. ఆ కొరడాను ఈరకోల అంటారు. ఆ కొరడా చూసి అంతా భయపడతారు కానీ ఈరకోలను మెడలో వేస్తే వారికి మంచి జరుగుతుందని, అనారోగ్య సమస్యలు తీరిపోతాయని విశ్వాసం. అందుకే పోతురాజులు మెడలో ఈరకోల వేస్తారని ఎదురుచూస్తారంతా. ఉదయం నుంచి సాయంత్రం వరకూ అస్సలు అలసిపోకుండా ఆడుతూనే ఉంటారు పోతురాజులు.

జూలై 10న రంగం

బోనాల పూజ కార్యక్రమాలు ఈ నెల 22, 25, 29, జూలై 2, 6, 9, 13, 16, 20వ తేదీల్లో ఉంటాయి. జూన్ 22 న గోల్కొండ లో ఆషాడ బోనాలు ప్రారంభమయ్యాయి. జులై 9 న సికింద్రాబాద్ మహంకాళి బోనాలు.. 10వ తేదీన రంగం ఉంటుంది. 16వ తేదీన ఓల్డ్ సిటీ బోనాలు, 17న ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది

Read more RELATED
Recommended to you

Latest news