మూడో రోజు రైతు బంధు నిధులు విడుదల.. రైతుల ఖాతాల్లో రూ.1,325.24 కోట్లు

-

మూడో రోజు తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ప్రారంభించిన రైతుబంధు నిధులు జమ కార్యక్రమం కొనసాగుతోంది. ఆరుగాలం కష్టపడే అన్నదాతలకు పెట్టుబడి సాయంగా ఏటా ఎకరానికి రూ.10వేల చొప్పున సర్కారు అందిస్తోంది. ఇప్పటికే పది విడుతల్లో రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసింది. పదకొండో విడతలో భాగంగా సోమవారం(జూన్ 26) నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు ఆర్థిక సాయం జమ అవుతుంది. ఇక మూడో రోజు (జూన్ 28)మొ 10.89 లక్షల రైతుల ఖాతాల్లో రూ.1325.24 కోట్లు జమ అయ్యాయి. ఇప్పటి వరకు 50.43 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.3246.42 కోట్లు జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Telangana Govt to disburse Rythu Bandhu amount from June 28 - Telangana  Today

ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. వ్యవసాయం, రైతు బాగుంటేనే సమాజం బాగుంటుందని, అందుకే జనాభాలో అధికశాతం ఆధారపడిన వ్యవసాయరంగం బలోపేతానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేయూతనిస్తున్నారని పేర్కొన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news