చిత్తశుద్ధి ప్రశ్న: బాబు చేతకానితనం ఒప్పేసుకుంటున్న అశోక్ బాబు!

-

కొంతమంది నేతలు టీవీ ఛానల్స్ లో డిబేట్లకు వచ్చినప్పుడు.. పైగా లైవ్ డిబేట్ లకు వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలనే విషయాలపై జాగ్రత్తలు తీసుకోరు. అది వారు అజ్ఞానమో.. లేక వెనువెంటనే స్పందించేయాలనే తుత్తరో.. అదీగాక జనం చూస్తున్నారనే సోయ లేకపోవడమో తెలియదు కానీ… తాజాగా ఒక ప్రముఖ ఛానల్ లో జరిగిన డిబేట్ లో బాబు పరువును, తమ విమర్శలపై ఉన్న క్రెడిబిలిటీని చెప్పకనే చెప్పేశారు టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు!

తాజాగా ఒక టీవీ డిబేట్ లో వైకాపా ఎమ్మెల్యే ఒకరు… నేడు విశాఖమీద ఏదో ప్రేమ ఉన్నట్లు.. ప్రమాధం జరిగిన వెంటనే మైకుల ముందుకు వచ్చి.. ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు టీడీపీ నేతలు అంటూ మొదలుపెట్టి… విశాఖ వాసులపై అంత ప్రేమ ఉంటే… ఇప్పటికీ ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించడానికి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. మీ మాటల్లో చిత్తశుద్ధికీ – చేతల్లో ఉన్న చిత్తశుద్ధికీ ఇది తేడా అని టీడీపీ నేతలు కార్నర్ చేశారు!

ఈ విషయాలపై కాస్త ఆలోచించి స్పందించాల్సిన సదరు టీడీపీ నేత అశోక్ బాబు… మా నాయకుడికి మీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.. అందుకే వెళ్లలేదు.. లేదంటే విశాఖకు వెళ్లేవారమే అని తమదైన శైలిలో స్పందించారు! సరిగ్గా ఇక్కడే విశ్లేషకులకు, నెటిజన్లకు దొరికిపోయారు అశోక్ బాబు!

కరోనా సమయంలో ఇళ్లు కదలడానికి ఏమాత్రం సాహసం చేయని బాబు… “జగన్ ని అనుమతి అడిగితే చిన్నతనం అని భావిస్తున్నట్లు” పరోక్ష లీకులు సోషల్ మీడియా ద్వారా వదిలారు! ఈ సమయంలో అనుకోని విధంగా మహానాడు నిర్వహించాల్సి రావడంతో… తన స్థాయి జాతీయ స్థాయి అని.. జగన్ ను అనుమతి అడిగేది ఏమిటని.. భావించినట్లుగా కేంద్ర ప్రభుత్వానికి ఫోన్ చేశారు…. స్పందన కరువు! దాంతో గత్యంతరం లేకో లేక వాస్తవాలు గ్రహించో కానీ.. మళ్లీ అమరావతి వెళ్లి, అక్కడి నుంచి విశాఖకు వెళ్తానని చెప్పి ఏపీ డీజీపీ నుంచి అనుమతి తీసుకున్నారు చంద్రబాబు!

అలా ఏపీ ప్రభుత్వ అనుమతితో ఏపీలోకి అడుగుపెట్టిన చంద్రబాబు… అమరవతిలో మహానాడు నిర్వహించుకుని అనంతరం చక్కగా హైదరాబాద్ గూటికి చేరిపోయారు. ఈ విషయాలు జనం మరిచారని అనుకున్నారో లేక జనాలకు అంత జ్ఞాపశక్తి ఎక్కడుందిలే అనీ భ్రమించారో తెలియదు కానీ… విశాఖ వెళ్లడానికి అనుమతి దొరకలేదు.. మీరు ఇవ్వలేదు.. మీరు ఇస్తే వెళ్లేవాళ్లం అనేశారు. అశోక్ బాబు ఇలా అనడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. బాబు పరువుతు తీశాడు.. బాబును తక్కువ చేసాడు.. విశాఖకు అనుమతి ఇస్తే అమారవతి వెళ్లి మహానాడు చేసుకుని వెళ్లిపోయి… ఇలా చేతకాని వారిగా చూపించాడు! అంటూ అశోక్ బాబుపై టీడీపీ నేతలు, కార్యకర్తలు ఫైరవుతున్నారు!!

ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే… ఏపీలో ప్రస్తుతం అన్ లాక్ పరిస్థితులే నెలకొన్నాయి. ఇప్పటికీ బాబు & కో విశాఖ వాసులను పరమర్శించింది లేదు. విశాఖ మీడుగా శ్రీకాకుళం వెళ్లి.. అవినీతి కేసులో అరెస్టయిన అచ్చెన్నాయుడు ఫ్యామిలీని పరామర్శించగలిగారు కానీ… వెళ్లేదారిలో ఉన్న విశాఖను మరిచిపోయారు. ఇలా తమ చిత్తశుద్ధిని నిరూపించుకుని… ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు అనడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి!!

Read more RELATED
Recommended to you

Latest news