ఒక పక్క రాజస్థాన్ లో రాజకీయం వేడిగా ఉన్న సమయంలో ఆ రాష్ట్ర సిఎం అశోక్ గెహ్లాట్.. కాంగ్రెస్ యువనేత తనను ఇబ్బంది పెట్టిన సచిన్ పైలెట్ ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. అందంగా ఉంటే సరిపోదు అంటూ మాట్లాడారు. అలాగే మన గుండెల్లో దేశం మీద ఏ అభిప్రాయం ఉందో అది మాత్రమే కీలకమని ఆయన చెప్పారు.
దీనిపై కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్ టీం లో సచిన్ ఒకరు. ఆయన ఇప్పుడు పార్టీకి దూరంగా ఉండటంతో రాహుల్ గాంధీ రంగంలోకి దిగి అశోక్ గెహ్లాట్ కాస్త సైలెంట్ గా ఉండాలి అని కోరింది. అనవసరంగా వ్యాఖ్యలు చేయవద్దు అని పేర్కొంది. ఢిల్లీ లో ఉన్న సచిన్ వెంటనే జైపూర్ వస్తే మంచిది అని సూచించింది. తాను పార్టీ సభ్యుడ్ని అని సచిన్ చెప్పడంతో వెంటనే అశోక్ గెహ్లాట్ బహిరంగ విమర్శలు చేయవద్దని అధిష్టానం ఆదేశించింది.