Asia Cup 2022: వివాదాలతో మొదలైన ఆసియా కప్.. తొలి మ్యాచ్‌లో థర్డ్ అంపైర్ చెత్త నిర్ణయం..

-

ఆసియా కప్ 2022లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు బోణీ కొట్టింది. తొలి మ్యాచ్ లో శ్రీలంక పై 8 వికెట్ల తేడాతో ఆఫ్గనిస్తాన్ జట్టు గ్రాండ్ విక్టరీ కొట్టింది. 106 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ కు ఓపెనర్లు హజ్రతుల్లా జాజాయ్ మరియు రెహమానుల్లా 83 పరుగుల భాగస్వామ్యం తొలి వికెట్ కు నెలకొల్పి అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. దీంతో ఆఫ్గనిస్తాన్ గ్రాండ్ విక్టరీ కొట్టింది.

అయితే ఈ మ్యాచ్ లో థర్డ్ ఎంపైర్ తీసుకున్న నిర్ణయం వివాదంగా మారింది. శ్రీలంక ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన నవీన్ ఫుల్ హక్ బౌలింగ్ లో బంతి పాతుం నిస్సంక బ్యాటుకు దగ్గరగా వెళుతూ, కీపర్ చేతిలో పడింది. వెంటనే బౌలర్ తో పాటు వికెట్ కీపర్ కూడా క్యాచ్ కు అప్పిల్ చేశారు. అయితే ఫీల్ ఎంపైర్ అనిల్ చౌదరి వెంటనే అవుట్ అని వేలు పైకి ఎత్తాడు.

 

ఈ నేపథ్యంలో నిస్సంక నాన్ స్ట్రైకింగ్ లో ఉన్న గుణ తిలకతో చర్చించి రివ్యూ కి వెళ్ళాడు. అయితే రిప్లై లో బ్యాట్ ను బంతి దాటే సమయంలో ఎలాంటి స్పైక్ కనిపించలేదు. అయినప్పటికీ థర్డ్ ఎంపైర్ మాత్రం బంతి బ్యాట్ పూర్తి తగిలినట్లు కనిపించింది అంటూ అవుట్ గా ప్రకటించారు. థర్డ్ ఎంపైర్ తీసుకున్న ఈ నిర్ణయం తో బ్యాటర్ తో పాటు డగౌట్ లో ఉన్న శ్రీలంక జట్టు మేనేజ్మెంట్ కూడా ఒకసారి షాక్ కు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news