ASIA CUP 2022: భారత్ – పాక్ మ్యాచ్ కోసం అదనపు టికెట్లు

-

ఆసియా కప్ లో భాగంగా దాయాది పాకిస్తాన్ తో తలపడేందుకు భారత్ సిద్ధమవుతోంది. గ తేడాది టి -20 వరల్డ్ కప్ లో భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. తర్వాత మళ్లీ ఇప్పుడే ఈ రెండు దేశాలు పిచ్ పై క్రికెట్ సమరానికి సిద్ధమవుతున్నాయి. ఆగస్టు 28న మ్యాచ్ జరగనుంది. 2018లో చివరిసారి వన్డే మ్యాచ్ లో తలపడ్డాయి భారత్ – పాక్. ఈసారి టి -20 ఫార్మాట్ లో ఆడేందుకు ఇరు జట్లు రెడీ అవుతున్నాయి. నాలుగేళ్ల తర్వాత ఆసియా కప్ మ్యాచ్ లు జరుగుతున్న తరుణంలో క్రికెట్ అభిమానులలో తీవ్ర ఆసక్తి నెలకొంది.

ఇదిలా ఉంటే.. ఈ రసవత్తర పోరును భారీగా సొమ్ము చూసుకునేందుకు ఐసీసీ ప్రయత్నిస్తోంది. అక్టోబర్ 23న జరిగే ఈ దాయాది జట్ల మ్యాచ్ కు సంబంధించి ఇప్పటికే టికెట్లన్ని హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. తాజాగా గురువారం నుంచి అదనంగా నాలుగు వేలకు పైగా స్టాండింగ్ టికెట్లను విక్రయానికి ఉంచారు. వీటి ధర ఒక్కోటి రూ. 1670 . భారత్ – పాక్ మ్యాచ్ ను వీలైనంత ఎక్కువమంది చూసేందుకు స్టాండింగ్ రూమ్ టికెట్లను అమ్మకానికి ఉంచామని ఐసీసీ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news