ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు జరిగే ఆసియా కప్ వేదికను శ్రీలంక నుంచి తరలించారు. ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో ఇబ్బందుల్లో ఉన్న శ్రీలంక ఓ ప్రధాన క్రికెట్ టోర్నమెంట్ కు ఆతిధ్యం ఇచ్చే అవకాశాన్ని కోల్పోయింది. ఆసియా కప్ టోర్నమెంట్ ను యూఏఈ కి తరలించినట్లు బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపారు. ఈసారి ఆసియా కప్ టోర్నీని టి-20 ఫార్మాట్లో నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య (ఐసిసి) నిర్ణయించింది.
అయితే శ్రీలంకలో నెలకొన్న సంక్షోభం దృష్ట్యా టోర్నీని నిర్వహించాలని లంక బోర్డు బుధవారం స్పష్టం చేసింది. దీంతో ప్రత్యామ్నాయ వేదిక ను చూడక తప్పలేదు. ఆసియా కప్ జరిగే సీజన్ లో ఉండే వాతావరణ పరిస్థితిని బట్టి చూస్తే యూఏఈ లోనే వర్షాలు పడే అవకాశం లేదు. అందుకే యూఏఈ నీ ఖాయం చేసినట్లు గురువారం ముంబైలో జరిగిన బీసీసీఐ అపెక్స్ సమావేశానికి హాజరైన గంగూలీ స్పష్టం చేశారు.