Asia Cup 2022: గొడవపడ్డ ఆటగాళ్ల తాట తీసిన ఐసీసీ.. భారీ జరిమానా విధింపు

-

ఆసియా కప్ 2022 సూపర్-4 లో భాగంగా బుధవారం రోజున పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ల మధ్య హోరాహోరీ మ్యాచ్ జరిగింది. అదృష్టం బాగోకపోతే అరటిపండు తిన్న పన్ను విరుగుద్ది అన్నట్టు చివరి నిమిషంలో గెలవాల్సిన ఆఫ్ఘనిస్తాన్ టీము ఒత్తిడి కారణంగా ఓటమిపాలైంది. అయితే ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ ఫరీద్ అహ్మద్, పాక్ బ్యాట్స్ మెన్ ఆసిఫ్ ఆలీ మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. 19వ ఓవర్లో ఫరీద్ అహ్మద్ వేసిన నాల్గవ బందికి సిక్స్ బాదిన ఆసిఫ్ ఆలీ, ఆ తర్వాత బంతికి ఔట్ అయ్యాడు.

అవుట్ అయ్యానన్న కోపంతో ఆప్గాన్ బౌలర్ ఫరీద్ అహ్మద్ బ్యాట్ తో కొట్టబోయాడకొట్టబోయాడు. పైవిలియన్ వైపు వెళ్తూ, ఫరీద్ అహ్మద్ కు వార్నింగ్ కూడా ఇచ్చాడు. అయితే ఫరీద్, ఆసిఫ్ ఆలీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడమే దీనికి కారణం అని తెలుస్తోంది.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే..ఆసిఫ్ ఆలీని క్రికెట్ నుంచి బ్యాన్ చేయాలని కోరుతూ ‘#BanAsifAli’ హ్యాష్ ట్యాగ్ ను కూడా ట్రెండ్ చేశారు. అయితే ఐసీసీ మాత్రం ఈ ఘటనలో ఇద్దరిదీ తప్పిదమని తేల్చింది. ఇద్దరిపై కఠిన చర్యలు తీసుకుని భవిష్యత్తులో మరోసారి ఇలా ప్రస్తావించకుండా, ఫరీద్ అహ్మద్, పాక్ క్రికెటర్ ఆసిఫ్ ఆలీ లకు 25 శాతం మ్యాచ్ ఫీజు కోత విధించడంతోపాటు డి మోరిట్ పాయింట్ వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news