ఇటీవలే మహీంద్రా షోరూమ్‌లోని ఓ సేల్స్ ఎగ్జిక్యూటివ్ రైతును అవమానించి క్షమాపణలు చెప్పుకున్న కథ గురించి విన్నాం. అయితే ఇక్కడొక వ్యక్తి మాత్రం స్కూటర్ కొనుగోలు చేసేందుకు బస్తా చిల్లరతో షోరూమ్‌కు వెళ్లాడు. మొత్తం ఆ చిల్లర నాణాలతోనే స్కూటర్‌ను కొనుగోలు చేశాడు. ఈ విచిత్రమైన ఘటన అస్సాంలో చోటు చేసుకున్నది.
అస్సాంలోని హిరాక్ జే దాస్ అనే చిల్లర వ్యాపారి కొత్త స్కూటర్‌ను కొనుగోలు చేయడానికి దాదాపు 8 నెలలకు పైగా చిల్లరను పొదుపు చేశాడు. వాటన్నింటిని ఓ బస్తాలో వేసి షోరూంకు తీసుకెళ్లాడు. ఆ షోరూం సిబ్బంది ఆ నాణాలను ప్లాస్టిక్ బుట్టలో వేసుకుని కొన్ని గంటల పాటు కష్టపడి లెక్కించారు. ఆ తరువాత అతను తనకు నచ్చిన స్కూటర్‌ను కొనుక్కున్నాడు. అతను స్కూటర్‌ను మొత్తం చిల్లర నాణాలతో కొనుగోలు చేయడం విశేషం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.