నాసా అద్భుత ప్రయోగం.. ఏకంగా గ్రహశకలం మార్గాన్నే మార్చేలా…

-

గ్రహశకలాలు ఎప్పుడైనా భూమికి ప్రమాదాలు తీసుకువచ్చే అవకాశం ఉంది. గతంలో భారీ ఆస్ట్రాయిడ్ ఢీ కొనడంతోనే డైనోసార్లు అంతరించాయి. మళ్లీ ఇటువంటి ప్రమాదం వస్తుందని కానీ.. పూర్తిగా రాదు అని కొట్టిపారేయడానికి వీలు లేదు. ఇటీవల మనకు తెలియకుండా భూమికి దగ్గర ఒక గ్రహశకలం వచ్చి వెళ్లింది. అయితే భవిష్యత్తులో గ్రహశకలాలతో ప్రమాదం ఉంటే ఎదుర్కోవడం ఎలా..? అనే ప్రశ్న ఎప్పటి నుంచో సైంటిస్టులను వేధిస్తోంది. అయితే భవిష్యత్తులో గ్రహశకలాలు వస్తే ఎదుర్కొనేందుకు ’నాసా ‘ఒక అద్భుత ప్రయోగాన్ని చేపట్టింది.  డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ (DART) పేరిట ఉద్దేశ పూర్వకంగా ఒక గ్రహశకలాన్ని ఢీ కొట్టే ప్రయోగానికి పూనుకుంది. గంటకు 24000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వ్యోమనౌకతో గ్రహశకలాన్ని ఢి కొట్టించనుంది. నవంబర్ 24న ప్రయోగించే DART, డబుల్ ఆస్టరాయిడ్ డిడిమోస్ మరియు దాని చంద్రుడు డిమోర్ఫోస్‌ను లక్ష్యంగా చేసుకుంటుంది. 2022లో వ్యోమనౌక లక్ష్యాన్ని చేరుకుంటుంది. వ్యోమనౌక వేగంగా వెళ్లి ఢీకొనడం వల్ల గ్రహశకలం తన మార్గాన్ని మార్చుకునేలా ప్రయోగం నిర్వహించనున్నారు. భవిష్యత్తులో గ్రహశకలాల నుంచి భూమికి ఎదురయ్యే ప్రమాదాలను తప్పించేందుకు, వ్యోమనౌక పనితీరును పరిశీలించేందుకే ఈ ప్రయోగాన్ని నిర్వహిస్తున్నట్లు నాసా సైంటిస్టులు తెలుపుతున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news