మీరు మంచి ల్యాప్ టాప్ ని తీసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే మీరు తప్పకుండ అదిరే ఫీచర్స్ తో ఉన్న ఈ ల్యాప్ టాప్ గురించి చూడాల్సిందే. పైగా ఈ ల్యాప్ టాప్ మనకి బడ్జెట్ లోనే వచ్చేస్తుంది. Asus ROG Strix G713 RW గేమింగ్ లాప్టాప్ లో ఎన్నో అద్భుతమైన ఫీచర్స్ వున్నాయి. సమస్యలు చాలా తక్కువే ఇందులో. అయితే మరి Asus ROG Strix G713 RW గేమింగ్ లాప్టాప్ గురించి చూసేద్దాం.
డిస్ప్లే 17.3-inch WQHD 240hz non-touchscreen, 16:9, 3ms
ప్రాసెసర్ AMD Ryzen 9 6900HX
గ్రాఫిక్స్ NVIDIA GeForce RTX 3070 Ti Laptop GPU
RAM 16GB
స్టోరేజ్ 1TB
బ్యాటరీ 90WHrs, four-cell Li-ion battery
ధర ₹1,02,990 నుండి మొదలు
ప్రీమియం గేమింగ్ ల్యాప్‌టాప్‌కి ఇది కాంపాక్ట్ అని చెప్పవచ్చు. పైగా ఇందులో నాలుగు ఫ్యాన్ అవుట్‌లెట్‌లు ఉన్నాయి. ఈ లాప్టాప్ లో రైటింగ్ వంటి వాటిని చేస్తున్నప్పుడు 60 డిగ్రీల సెల్సియస్‌ను దాటదు. LAN, HDMI మరియు USB-C పోర్ట్‌లు వెనుక భాగంలో ఉన్నాయి. రెండు USB-A పోర్ట్‌లు మరియు 3.5mm జాక్ ఎడమ వైపున ఉన్నాయి.
గేమింగ్ లాప్టాప్ మూలాన USB-A పోర్ట్‌లు ఎక్కువ వున్నాయి. అలానే ఈ లాప్టాప్ కి పెద్ద కీప్యాడ్ వుంది. అలానే విశాలమైన టచ్‌ప్యాడ్‌తో ఈ లాప్టాప్ వస్తుంది. స్ట్రిక్స్ సిగ్నేచర్ గ్లిట్జీ లైట్లు లాప్టాప్ చుట్టూ ఉంటాయి. అలానే ఈ లైట్ల రంగులు మరియు రిథమ్స్ ని మార్చడానికి ప్రత్యేకమైన ఫంక్షన్ కీ కూడా వుంది.
గేమింగ్ కోసం అయితే ఈ లాప్టాప్ చాలా బాగుంటుంది. పైగా ఈ ధరకి గేమింగ్ లాప్టాప్ అంటే చాలా తక్కువే. ల్యాప్‌టాప్ యొక్క 90WHrs నాలుగు-సెల్ లి-అయాన్ బ్యాటరీ తో రెండు గంటలు గేమింగ్ కి ఉపయోగ పడుతుంది. మీరు రెండు బ్యాటరీ పవర్ సేవ్ మోడ్‌లతో మీ బ్యాటరీని ఆదా చెయ్యచ్చు. ఇది ఛార్జింగ్‌ను 80% లేదా 60%కి పరిమితం చేస్తుంది. USB-C పోర్ట్ కూడా ఉంది. కాబట్టి, మీరు గేమింగ్ చేస్తుంటే వేగవంతమైన మొబైల్ ఛార్జర్‌తో ఛార్జ్ చేసుకోచ్చు.
Asus ROG Strix G713 RW ఫీచర్స్ :
17.3-inch WQHD 240hz non-touchscreen, 16:9, 3ms డిస్ప్లే. AMD Ryzen 9 6900HX ప్రాసెసర్ వుంది అలానే 16GB ర్యామ్, 90WHrs, four-cell Li-ion బ్యాటరీ తో ఈ లాప్టాప్ ని తీసుకొచ్చారు.