హైదరాబాద్ నగర వాహనదారులకు కోవిడ్ కారణంగా సడలించిన ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినంగా ఉండేలా ప్రణాళిక సిద్ధం చేశామని ట్రాఫిక్ జాయింట్ సి పి రంగనాథ్ అన్నారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే మునుపటిలాగే కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. వాహనాల అద్దాలపై స్థాయిని మెన్షన్ చేస్తూ స్టిక్కర్స్ అంటించరాదన, నిబంధనలకు విరుద్ధంగా స్టిక్కర్స్ వేసుకుని తిరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
పోలీస్ శాఖ ఇచ్చిన స్టిక్కర్స్ మాత్రమే వాడాలని రూల్స్ పాటించని వారిపై 177 మోటార్ వెహికల్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా స్పీడ్ లిమిట్ ఒకేలా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు సిపి రంగనాథ్. త్వరలో స్పీడ్ లిమిట్ విధానం అమలులోకి తెస్తామని చెప్పారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే చార్జిషీట్లు వేస్తామని హెచ్చరించారు. ఏప్రిల్ నెల నుంచి ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని ట్రాఫిక్ జాయింట్ సి పి రంగనాథ్ అన్నారు.