53 దేశాల్లోని 3,336 మంది భారతీయులకు కరోనా

-

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఉధృతి రోజురోజుకు పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 20 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే కరోనా కారణంగా చాలా దేశాలు లాక్ డౌన్ ప్రకటించడంతో.. ఎక్కడివారు అక్కడే నిలిచిపోయారు. చాలా మంది భారతీయులు కూడా విదేశాల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన తీవ్ర భయాందోనలు నెలకొన్నాయి. చాలా మంది తమను ఇండియాకు తీసుకెళ్లాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

అయితే ప్రస్తుతం కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుండటం వల్ల విదేశాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి వీలుపడదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. విదేశాల్లో ఉన్నవారు ఓపికతో ఉండాలని ప్రభుత్వం సూచించింది. భారత్‌లో లాక్ డౌన్ పూర్తయి.. ఆయా దేశాల్లో కూడా అంక్షలు సడలించిన తర్వాత భారతీయులను స్వదేశానికి తరలిస్తామని చెప్పింది. కాగా, 53 దేశాల్లో ఉన్న 3,336 మంది భారతీయులకు కరోనా సోకిందని ప్రభుత్వం తెలిపింది. అలాగే కరోనా పాజిటివ్ వచ్చినవారిలో 25 మంది మృతిచెందారని పేర్కొంది.

మరోవైపు దాదాపు 55 దేశాలకు యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రోక్లోరోక్విన్‌ను సరఫరా చేసినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అలాగే దక్షిణ కొరియా, చైనా నుంచి కరోనా టెస్టింగ్ కిట్లను దిగుమతి చేసుకున్నట్టు చెప్పింది. అమెరికా, యూకే, మ‌లేసియా, ఫ్రాన్స్‌, జపాన్‌ల నుంచి మరిన్ని వైద్య పరికరాలు రావాల్సి ఉందని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news