కరోనా పుట్టింది ల్యాబ్ లో కాదా…?

-

కరోనా వైరస్ గురించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్న నేపధ్యంలో అసలు ఈ వైరస్ ఎలా వచ్చింది అనే విషయం పై అందరిలోనూ చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. కొందరు గబ్బిలాలు, పాములు, అలుగు వంటి వాటి విసర్జకాల ద్వారా వచ్చింది అని కొందరు అంటుంటే, ఈ వైరస్ ను కావాలనే సృష్టించడం జరిగింది అని మరికొన్ని ఊహాగానాలు వస్తున్నాయి. అయితే మొదట ఈ వైరస్ చైనాలోని ఊహాన్ నగరం నుంచి…

ప్రపంచానికి సోకడంతో చైనా పై పలు రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మహమ్మారి చైనా దేశంలోని వుహాన్‌ నగరంలోనీ ఓ ల్యాబ్‌లో కరోనా వైరస్‌ను సృష్టించారనే ఆరోపణలను చైనా అధికార ప్రతినిధి ఒకరు గురువారం ఖండించారు. మరోపక్క అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బుధవారం ఈ విషయం పై మాట్లాడుతూ తమ ప్రభుత్వం కరోనా వైరస్‌ ను కొందరు అనుమానిస్తున్న విధంగా,

ల్యాబ్‌ నుంచి వ్యాప్తి చెందిందా అనే విషయాన్ని తేల్చే పనిలో ఉందన్నారు. చైనా నిజానిజాలు వెల్లడించాలని స్టేట్‌ సెక్రెటరీ మైక్‌ పాంపియో డిమాండ్‌ చేశారు. కరోనా వ్యాప్తికి సంబంధించిన సమాచార వెల్లడిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది అని చైనాపై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే కరోనా వైరస్‌ను ల్యాబ్‌లో సృష్టించినట్లు ఎటువంటి ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) స్పష్టం చేసినట్లు చైనా విదేశాంగశాఖ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news