తెలుగుదనం ఉట్టిపడేలా….”ఆటా కాన్ఫరెన్స్ లోగో “….!!

-

అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా), ఇది అమెరికాలో పెద్ద తెలుగు సంఘాలలో ఒకటి. అక్కడ తెలుగు వారికి అన్ని విధాల సహాయపడుతూ, నిరంతంరం వారికి ఎన్నో రకాల సేవలు అందిస్తూనే, సాంప్రదాయాలను కాపాడటానికి తెలుగు కళలను కూడా ప్రోత్సహిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే  ఆటా ప్రతీ రెండేళ్లకొకసారి మహాసభలు నిర్వహిస్తూ వస్తోంది. ప్రతీ ఏటా ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నట్టుగానే ఈ ఏడాది కూడా ఆటా తన 16వ మహాసభాలని అట్టహాసంగా నిర్వహించనుంది. ఈ మహాసభలకు ప్రత్యేక వేదికగా కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఏంజెల్స్ ను ఎంచుకుంది.

జులై 3 నుంచి 5వ తేదీ వరకు ఈ వేడుకలని నిర్వహించనుంది. ఈ నేపధ్యంలోనే.. ఈ వేడుకల కోసం ఆవిష్కరించిన లోగో అచ్చమైన తెలుగుదనం ఉట్టిపడేలా అందరిని ఆకర్షిస్తోంది. ఈ లోగో లో వరంగల్ కాకతీయ ముఖద్వారం, గౌతమ బుద్ధుడు, చార్మినార్, తిరుపతి దేవస్థానం, మరియూ బతుకమ్మలు, సాంప్రదాయ నృత్యకళాకారిణుల ప్రతిమలతో ఎంతో చూడ ముచ్చటగా రూపొందిచారు. ఇంకా, లోగో లో రెండు పక్కల అమెరికా, భారతీయ జాతీయ జెండాలను కూడా చేర్చారు. అంతేకాదు

 

ఈ లోగో లో  ఆటా మహోత్సవం, లలితా కళా వైభవం, యువత ప్రాభవం, ఈ మూడు నినాదాలను ముద్రించారు.ఈ మహాసభలని ఉద్దేశించి ఆటా ప్రెసిడెంట్ పరమేష్ భీంరెడ్డి మాట్లాడుతూ  మహాసభలు అందరిని ఆకట్టుకునేల ఉంటాయని, అమెరికాలోని ప్రముఖలతో పాటు భారత్ కు సంబంధించి పలువురు ప్రముఖులు, ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానించినట్లు తెలిపారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news