ఢిల్లీలో ఫిబ్రవరి 8వ తారీఖున అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచారంలో స్పీడ్ పెంచాయి. ఇదే తరుణంలో మేనిఫెస్టోను కూడా విడుదల చేశాయి ఆయా పార్టీలు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఉన్న నిరుద్యోగులకి సూపర్ డూపర్ బంపర్ తిరుగులేని ఆఫర్ ప్రకటించింది.
ఢిల్లీలో ఉన్న నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఢిల్లీలో డిగ్రీ చదువుకున్న నిరుద్యోగులకు ఏకంగా ఐదు వేల రూపాయల నుండి 7500 రూపాయల వరకు నిరుద్యోగ భృతి ఇస్తానని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో తెలిపింది. అంతేకాకుండా ఇందిరా క్యాంటీన్ లో మరియు ప్రతి ఇంటికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అదేవిధంగా ఢిల్లీలో కాలుష్య నివారణకు చర్యలు వంటివి కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో తెలిపింది.
గతంలో నిరుద్యోగ భృతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు ప్రకటించడం జరిగింది. 2014 ఎన్నికల్లో తన మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన ఈ హామీని చంద్రబాబు అమలు చేయలేక చివరిలో ఎన్నికలకు ముందు అమలులోకి తీసుకు రావడం జరిగింది. అయినా గాని ఏపీలో చంద్రబాబు ఓడిపోయారు. మరి కాంగ్రెస్ ఢిల్లీలో గెలుస్తుందో లేదో చూడాలి.