ఈ మధ్యన క్యాష్ పేమెంట్స్ ని చాలా తక్కువ మంది మాత్రమే చేస్తున్నారు. టెక్నాలజీ బాగా పెరిగి పోవడంతో ఆన్ లైన్ పేమెంట్స్ ని చేసేందుకే ఆసక్తి చూపుతున్నారు. అలానే ఏటీఎం నుండి ఎప్పటికప్పుడు క్యాష్ ని తీసుకుంటూ వుంటారు చాలా మంది. డబ్బులు విత్‌డ్రా చేయాలంటే డెబిట్ కార్డు తప్పనిసరి అని అందరికీ తెలిసిన విషయమే.
కానీ కొత్త సర్వీలను ఇప్పుడు ప్రవేశపెడుతోంది. ఇక పూర్తి వివరాలను చూస్తే.. మీరు కనుక ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేయాలంటే డెబిట్‌కార్డు ఏ అక్కర్లేదు. మీ ఫోన్ వున్నా కూడా సరిపోతుంది. ఇంటర్‌ఆపరబుల్ కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రావల్ అని ఓ ఫీచర్ ని తీసుకు వచ్చారు. దీని ద్వారా కస్టమర్లు కార్డుని తీసుకు వెళ్లకపోయినా సరే ఏటీఎం నుండి మనీ తీసుకోవచ్చు.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఏటీఎంలలో కార్డు లేకుండా మనీ తీసుకునే ప్రయోజనాన్ని అందిస్తున్నారు. యూపీఐ సేవలను మీరు గూగుల్ పే, ఫోన్ పే మొదలైన వాటి ద్వారా చేసేయచ్చు.
యూపీఐని ఉపయోగించి డబ్బులని ఏటీఎం ద్వారా ఎలా తీసుకోవాలి..?
దీని కోసం మొదట మీరు ఏటీఎం కి వెళ్ళండి.
తరవాత స్క్రీన్‌పై ‘విత్‌డ్రా క్యాష్’ ఆప్షన్‌ను సెలెక్ట్ చేయండి.
ఇప్పుడు యూపీఐ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
ఏటీఎం స్క్రీన్‌పై క్యూఆర్ కోడ్ వస్తుంది..
ఫోన్‌లో యూపీఐ యాప్‌ని ఓపెన్ చేసేసి ఏటీఎం మెషీన్‌లో వచ్చిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయండి.
ఇప్పుడు అమౌంట్ ని ఎంటర్ చేసేసి యూపీఐ పిన్‌ని ఎంటర్ చేసి ‘హిట్ ప్రొసీడ్’ బటన్‌ను నొక్కండి.
అంతే డబ్బులు వచ్చేస్తాయి.