వామ్మో..రూ.20 రూపాయల కోసం దారుణం..గూస్ బంబ్స్ తెప్పిస్తున్న వీడియో..

-

ఆవేశంలో తీసుకొనే తొందరపాటు నిర్ణయాలు జీవితాన్ని నాశనం చేస్తాయి. ఇలాంటి వీడియోలు ఎన్నో సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్నారు. తాజాగా ఉత్తర ప్రదేశ్ లో ఓ దారుణం వెలుగు లోకి వచ్చింది.. రూ. 20 కోసం ప్రాణాల మీదకు తెచ్చుకున్నా డు ఓ యువకుడు. చూస్తుండగానే ఆ యువకుడు రైలుకి ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడు వేగంగా వస్తున్న రైలుకి ఎదురుగా నిల్చుని ఆత్మహత్య చేసుకున్నదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

యూపీలోని ఇటావాలో సలీమ్ అనే యువకుడు స్థానిక దుకాణదారుడికి రూ.20 బాకీ పడ్డాడు. ఈ క్రమంలో షాపు దగ్గరికి వెళ్లిన సలీమ్ తనకు పాన్ కావాలని అడిగాడు. అయితే, అప్పు విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ముందు తన బాకీ చెల్లించాలని దుకాణదారుడు సలీమ్ ను అడిగాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య మాటమాట పెరిగింది. కొట్టుకునే వరకు వెళ్లింది.

షాప్ అతనితో గొడవకు దిగారు..చాలా సేపు వాదన వినిపిస్తున్నాడు..అతడితో పాటు అతడి బంధువులంతా సలీమ్ పై దాడి చేశారు. అతడిని తీవ్రంగా కొట్టారు. వారి దెబ్బలకు తాళలేకపోయిన సలీమ్ అక్కడి నుంచి నేరుగా షాప్ పక్కనే ఉన్న రైల్వే ట్రాక్ పైకి వచ్చాడు. అదే సమయంలో వేగంగా రైలు వస్తోంది. దానికి ఎదురుగా నిల్చున్నాడు సలీమ్. వేగంగా వచ్చిన రైలు ఢీకొనడంతో సలీమ్ స్పాట్ లోనే చనిపోయాడు.

అంతా చూస్తుండగానే సలీమ్ ఇలా రైలుకి ఎదురెళ్లి సూసైడ్ చేసుకున్నాడు. కళ్ల ముందే ఘోరం జరిగిపోవడంతో అంతా షాక్ అయ్యారు. సలీమ్ రైల్వే ట్రాక్ పైకి రావడం, రైలు వేగంగా వచ్చి ఢీకొనడం, అతడు స్పాట్ లో చనిపోవడం.. అంతా క్షణాల్లో జరిగిపోయింది.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. యువకుడి ఆత్మహత్యకు కారణమైన దుకాణదారుడు సహా ఏడుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఐపీసీ సెక్షన్లు 147,323,306 కింద కేసులు నమోదు చేశారు..ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది..

Read more RELATED
Recommended to you

Latest news