మహారాష్ట్ర లో దారుణం చోటు చేసుకుంది. సోలాపూర్ జిల్లాలో 16 ఏళ్ల దళిత బాలికను ఆరు నెలల పాటు 10 మంది అత్యాచారం చేసినట్లు మహారాష్ట్ర పోలీసులు బుధవారం తెలియజేశారు. పోలీసులు ఆమెను విచారించిన తరువాత, ఆమె తను ఎదుర్కొన్న భయానక పరిస్థితిని వివరించింది. తరువాత పోలీసులు కేసు నమోదు చేశారు. 10 మందిలో ఐదుగురిని అరెస్టు చేశారు” అని సోలాపూర్ పోలీసు అధికారి తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే నగరంలోని ఒక ఆలయం వెలుపల బాలిక ఏడుస్తున్నట్లు కొంతమంది స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. బాలిక తండ్రి కొంతకాలం క్రితం మరణించాడు. ఆమె తన తల్లితో కలిసి ఇక్కడే నివాసం ఉంటుంది. ఆమె జీవనోపాధి కోసం చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ జీవిస్తుందని పోలీసులు మీడియాకు వివరించారు.
ఆ సమయంలో కొందరు అబ్బాయిలతో స్నేహాలు ఏర్పడ్డాయి. ఈ అఘాయిత్యానికి పాల్పడిన వారిలో కొంతమంది ఆమె స్నేహితులు కూూడా ఉన్నారు. వీరిలో కొందరు ఆటో-రిక్షా డ్రైవర్లు, ఆరునెలలకు పైగా ఆమెను బలవంతంగా వివిధ ప్రదేశాలకు తీసుకెళ్లి అత్యాచారం చేశారని అధికారి తెలిపారు.
ఇక్కడి విజయపూర్ నాకా పోలీస్ స్టేషన్లో వారిపై కేసు నమోదు చేశారు, ఇతర నిందితుల కోసం అన్వేషణ కొనసాగుతోందని తెలిపారు. నిందితులలో ఐదుగురిని భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 376-డి (గ్యాంగ్రేప్) మరియు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం (పోక్సో) మరియు షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల (దారుణాల నివారణ) చట్టం కింద అరెస్టు చేసినట్లు వారు వివరించారు.