దిశ పోలీస్ స్టేషన్ లో మహిళ అధికారి పై దాడి

-

యువతులు, మహిళలు, చిన్నారుల అత్యాచారాలు, అఘాయిత్యాలు అరికట్టేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ దిశ చట్టాన్ని తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 18 ప్రత్యేక దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిశ పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. కానీ మహిళల రక్షణ లేకుండా పోయింది. మహిళల కోసం ఏర్పాటు చేసిన దిశ పోలీస్ స్టేషన్ లోనే మహిళలపై దాడి జరుగుతున్నాయి. మహిళా కానిస్టేబుల్ పై సీఐ అత్యచారానికి పాల్పడిన ఘటన గుంటూరు జిల్లాలోని దిశ పోలీస్ట్ స్టేషన్ లో చోటు చేసుకుంది.

Disha Police station

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లాలోని దిశ పోలీస్ స్టేషన్ లో సీఐగా విధులు నిర్వహిస్తున్న ఉస్మాస్ ఓ మహిళపై దాడికి దిగాడు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళపై సీఐ దురుసుగా ప్రవర్తించాడని, కేసు నమోదు చేసుకోకుండా దాడికి పాల్పడ్డాడని ఆమె ఉన్నత అధికారులకు పేర్కొంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు. విచారణ జరిపి సీఐపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆమె వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news