భారత నూతన ‘కంప్ర్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్’గా గిరీష్ చంద్ర ముర్ము శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అయితే జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి ముర్ము రెండు రోజుల క్రితమే రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
Watch LIVE as President Kovind administers oath of office and secrecy to CAG-designate Shri GC Murmu https://t.co/jjpt1q2vWC
— President of India (@rashtrapatibhvn) August 8, 2020
దీంతో జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా మనోజ్ సిన్హా నియమితులయ్యారు. ప్రస్తుత కాగ్ రాజీవ్ మెహెర్షి పదవీ విరమణ చేసిన నేపథ్యంలో ఆయన స్థానంలో ముర్ము బాధ్యతలు చేపట్టారు. కాగా, కోవిడ్-19 నిబంధనల మేరకు అతి తక్కువ మందితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.